దాంపత్య జీవితంలోని పని సామర్థ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను, మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆహారపు అలవాట్లు కూడా దాంపత్య జీవితానికి అవసరమైన పని సామర్థ్యం మీద ఎఫెక్ట్ చూపుతాయి. ముఖ్యంగా మగాళ్లలో ఆండ్రోపాజ్ దశలో సమస్యలు తీవ్ర స్థాయిలో వేధిస్తాయి. దీనిపై యోగా గురు అరుణా దేవి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఎక్కువగా మోనోపాజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మహిళలకు మోనోపాజ్ దశరాగానే సమస్యలు మొదలవుతాయి. జుట్టు ఊడిపోతోందన్నా.. ముడతలు వస్తున్నా మోనాపాజ్ అంటున్నారు. ఏ సమస్య వచ్చినా మోనోపాజ్ దశ అని తేల్చేస్తున్నారు. ప్రతీ ఒక్క మహిళ ఇప్పుడు మోనోపాజ్ అండి అనేస్తున్నారు. స్త్రీలు ఎలా అయితే మోనోపాజ్ దశను ఎదుర్కొంటారో.. పురుషులు కూడా అలానే మోనోపాజ్ దశను ఎదుర్కొంటారు.
కానీ, దాని గురించి పెద్దగా మాట్లాడరు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు పురుషులకు కూడా ఉంటాయి. పురుషుల్లో వచ్చే దశను ఆండ్రోపాజ్ అంటాము. ఈ ఆండ్రోపాజ్ గురించి కొంతమందికి తెలీదు. కొందరిలో ఈ దశ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. మరికొందరిలో కొన్ని నెలలు ఉంటుంది. ఈ దశ ఎవ్వరికీ అర్థం కాదు. అది వచ్చిందని కూడా కొంతమందికి తెలీదు. కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. నీరసం వస్తోందని అంటూ ఉంటారు. అంతకు ముందు అంత చేసేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఈవినింగ్ అయ్యే సరికి నా వల్ల కావటం లేదు. పడుకుంటున్నాను అంతే అంటూ ఉంటారు. మరికొంత మంది బరువు పెరుగుతున్నామని అంటుంటారు. చాలా మందిలో దాంపత్య జీవితానికి అవసరమైన పని విషయంలో ఆసక్తి తగ్గుతుంది.
చేయాలని కూడా అనిపించదు. మనసులో ఆ ఆలోచన ఉన్నా ఆసక్తి రాకపోవటం. శీఘ్ర స్కలనం వంటివి అవుతూ ఉంటాయి. పురుషుల్లో ఎక్కువగా శీఘ్ర స్కలనం, దాంపత్య జీవితానికి అవసరమైన పనిలో ఆసక్తి తగ్గిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీని గురించి బయటకు కూడా చెప్పుకోలేరు. ఏదో పెద్ద సమస్యలాగా ఫీలయి బయటకు చెప్పుకోలేరు. మహిళలు మాట్లాడుతూ ఉంటారు. కానీ, పురుషులు మాట్లాడరు. ఆండ్రోపాజ్ రావటానికి మొదటి కారణం బరువు తగ్గే ప్రొగ్రామ్‌లు చేయటం. డైట్‌లు పాటించటం. వ్యాయామాల కారణంగా బరువు తగ్గితే ఎలాంటి సమస్యా రాదు. కానీ, డైట్ వల్ల తగ్గితే సమస్య వస్తుంది’’ అని అన్నారు.