మనిషి జీవితంలో శృంగారం అన్నది ఓ ప్రధానమైన భాగం. ఆకలి, దప్పిక లాగే శృంగారం కూడా ఓ సాధారణమైన విషయం. ఒకానొక సమయంలో శృంగారం విషయంలో విచ్చల విడితనం ఉండేది. కోర్కెలు కలిగిన టైంలో వారు వీరు, అని కాకుండా ఎవరితో ఒకరితో తమ కోర్కెను తీర్చుకునే వారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు.. శృంగారం విషయంలో విచ్చల విడితనం ఉండేది. కానీ, నాగరికత కొద్దిగా అభివృద్ధి చెందిన తర్వాత బంధాలు ఏర్పడ్డాయి. ఒక ఆడదానికి ఒక మగాడు అన్న బంధం.. పెళ్లి రూపంలో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చాలా మంది తమ కోర్కెలు తీర్చుకోవటానికి పెళ్లి వరకు ఆగుతున్నారు.
మరికొంత మంది ముందుగానే వాటిని తీర్చుకుంటూ ఉన్నారు. వీటి వల్ల పెద్దగా సమస్య ఉండదు. కానీ, శృంగార కోర్కెలు ఎక్కువయితేనే అసలు సమస్య మొదలవుతుంది. శృంగార కోర్కెలు ఎక్కువవటం వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ సైకాలజిస్ట్, న్యూరోమెంటర్ జోష్యుల పూజిత మాట్లాడుతూ.. ‘‘ సెక్సువల్ ఎడిక్షన్.. నార్మల్ సెక్సువల్ డిసైర్స్‌కు మధ్య తేడాలు ఉన్నాయి. సెక్సువల్ ఎడిక్షన్ ఉన్నవారు తమ కోర్కెలను కంట్రోల్ చేసుకోలేరు. వాళ్లకు తెలిసినా కూడా కొన్నిటిని కంట్రోల్ చేసుకోలేరు. అది తప్పు, దాని వల్ల ఇతర సమస్యలు వస్తాయని కూడా వాళ్లకు తెలుసు. అది ప్రమాదం అని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. బలమైన కోర్కె వాళ్లను డామినేట్ చేస్తూ ఉంటుంది. దాని వల్ల వారి సంబంధాలు మొత్తం తెగిపోతుంటాయి. అమ్మానాన్నలతో కూడా సరిగా ఉండలేరు. ఈ కోర్కెలను పార్ట్‌నర్ తట్టుకోలేకపోతే వేరుపడిపోతారు.
24 గంటలు పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోతారు. కొంతమందికి ఒకరు చాలరు.. నలుగురు ఐదుగురు కావాలి. వాళ్లతో మెసేజ్‌లు చేస్తూ ఉంటారు. ఒక పార్ట్‌నర్‌తో సంతృప్తి పడరు. వీళ్లు కాకపోతే వీళ్లు అన్నట్లు ఉంటారు. ఆన్‌లైన్‌లో కూడా పోర్న్ చాటింగ్ చేస్తుంటారు. అది తప్పని తెలిసినా కూడా చేస్తుంటారు. జాబ్ చేయలేరు. పనికి వెళతారు. శ్రద్ధ మాత్రం పెట్టలేరు. 24 గంటలు అవే ఆలోచనలు. సెక్స్ వల్ల ఎలాంటి ఆనందం లేకపోయినా అదే పని చేస్తుంటారు. ఇది వ్యాధి కాదు.. తప్పని సరిగా చేయాలనే ఓ బలమైన కోరిక.. ఒక రకంగా చెప్పాలంటే ఓసీడీ లాంటిది. సాధారణంగా 28 ఏళ్ల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఆడ,మగ ఇద్దరిలో కలుగుతుంది. మగాళ్లు బయటపడతారు. ఆడవాళ్లు బయటపడలేరు. ఒక వేళ సెక్స్‌కు అడిక్ట్ అయినట్లు మీరు ఎవరినైనా గుర్తిస్తే వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. సెక్సువల్ ఎడిక్షన్‌కు కౌన్సిలింగ్ లాంటివి తప్పనిసరి’’ అని అన్నారు.