వేసవికాలం రాగానే అందరూ ఇంటికే పరిమితమవుతారు. ఎండలో అడుగు తీసి బయట పెట్టరు. సమ్మర్ లో ఎండలను తట్టుకునేందుకు ప్రత్యేకంగా సంసిద్ధం అవుతారు. కానీ, మీ కారుని మాత్రం పట్టించుకోరు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేస్తుంటారు. అలా చేస్తే ఈ సమ్మర్ లో మీ కారు మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతుంది. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఏ చింతా లేకుండా ఈ సమ్మర్ ని ఎంజాయ్ చేయచ్చు.
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయట అడుగుపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయంలో వేసవి తాపం నుంచి తప్పించుకోవాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషులంటే జాగ్రత్తగా ఉంటారు. మరి కార్ల పరిస్థితి ఏంటి? మీరు ఎలా అయితే వేసవిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతారో.. అలాగే మీ కారుని కూడా సమ్మర్ కోసం రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కారు మిమ్మల్ని ఎలాటి ఇబ్బందులు పెట్టకుండా ఉంటుంది. అయితే మీ కారు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ సమ్మర్ సాఫీగా సాగిపోవాలి అంటే.. ఈ 5 అంశాలను ఫాలో అవ్వాల్సిందే.
ఎండాకాలం అంటే మీకు కారులో ముఖ్యంగా ఏసీ కావాలి. కాబట్టి సమ్మర్ వస్తోంది అంటే ఒకసారి ఏసీని చెక్ చేయించుకోవాలి. సరిగ్గానే ఉందా లేదా? ఏసీ ఫిల్టర్ ని క్లీన్ చేయించుకోవడం, అవసరమైతే ఏసీ ఫిల్టర్ ని మార్చడం చేయాలి. డాష్ బోర్డు లో ఉండే ఏసీ బటన్లు, ఏసీ కంట్రోల్స్ ని కూడా చెక్ చేయించుకోవాలి.
కారు అద్దం నీట్ గా ఉండాలన్నా, మీకు రోడ్డు చక్కగా కనిపించాలన్నా విండ్ షీల్డ్ వైపర్స్ చాలా ముఖ్యం. విండ్ షీల్డ్ ఎండకు వేడెక్కుతుంది కాబట్టి.. వైపర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వేసవికి ముందే వాటిని చెక్ వైపర్ బ్లేడ్స్ చేసుకోవాలి. అవసరమైతే కొత్త వైపర్స్ తీసుకోవడం ఉత్తమం. వైపర్ బ్లేడ్స్ నీట్ గా లేకపోతే విండ్ షీల్డ్ మీద గీతలు పడే అవకాశం కూడా ఉంటుంది.
ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు కారుకి మంచి లైఫ్ ఉన్న టైర్లను వాడాలి. కాస్తో కూస్తో బటన్ ఉన్న టైర్లు ఎండల్లో జర్నీకి పనికిరావు. అంతేకాకుండా టైర్లలో గాలిని చెక్ చేసుకుంటూ ఉండాలి. పరిమితికి మించి గాలిని పెట్టడం అంత మంచిది కాదు. అలా చేస్తే ఎండకు టైర్లలో ప్రెజర్ పెరిగి పేలిపోయే అవకాశం ఉంది. సమ్మర్ లో లాంగ్ జర్నీ చేయడం కూడా అంత మంచిది కాదు. మధ్యలో రెండు గంటలకు ఒకసారైనా కారుని కాసేపు పక్కన ఆపి దానికి రెస్ట్ ఇవ్వాలి.
ఎండాకాలంలో ఎయిర్ ఫిల్టర్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గాలిని శుద్ధి చేసి ఇంజిన్ లోకి పంపుతాయి. ముఖ్యంగా సమ్మర్ లో గాలిలో కాలుష్య కారకాలు, ఉద్ఘారాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వేసవిలో కారుకి ఎయిర్ ఫిల్టర్స్ నీట్ గా ఉండటం ఎంతో అవసరం. సమ్మర్ పొల్యూషన్ కు మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది. క్లీన్ చేయించడం, అవసరం అనుకుంటే మార్చడం మంచిది. సాధారణంగానే అవి బాగా మట్టి పేరుకుని ఉంటాయి.
మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కారుని ఎండలో వదిలేస్తే ఇవన్నీ వృథా పోయినట్లే. ఎండలు విపరీతంగా ఉంటున్న సమయంలో ముఖ్యంగా పగటిపూట కారుని ఎండలో వదిలేయకండి. సాధ్యమైనంత వరకు నీడలో పార్క్ చేయండి. ఒకవేళ సెల్లార్ పార్కింగ్, చెట్లు లేకపోతే.. గ్రీన్ నెట్ అయినా ఏర్పాటు చేసుకోండి. కారు ఎండలో ఉంటే కలర్ వేడవటం, టైర్లు పాడవటం, ఇంజిన్ ఊరికే హీట్ అవటం జరుగుతుంది. సీటు కవర్లు కూడా వేడికి త్వరగా పాడవుతాయి. అందుకే ఎండలో పార్క్ చేయకుండా నీడగా ఉండే ప్రాంతాల్లోనే పార్క్ చేసుకోవాలి.