నేటికాలంలో స్వార్థ పరుల సంఖ్య పెరిగిపోతుంది. ఎదుటి వారికి కష్టాలు వస్తే పట్టించుకునే వారే ఉండరు. కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అనే మాటను బలంగా నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేస్తుంటారు.
నేటికాలంలో స్వార్థ పరుల సంఖ్య పెరిగిపోతుంది. ఎదుటి వారికి కష్టాలు వస్తే పట్టించుకునే వారే ఉండరు. ఎవరు ఎలా పోతే మాకెంటిలే.. మేము బాగానే ఉన్నాము కదా? అనే భావనలో ఉన్నారు. అయితే కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అనే మాటను బలంగా నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేస్తుంటారు. తాజాగా ఓ యువతి కూడా గొప్ప సాయం చేసి.. తన మంచి మనస్సును చాటుకుంది. ఆ యువతి చేసిన సాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కొన్ని రోజుల నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలపై నిర్ధాక్షణ్యంగా కిరణాలతో విరుచపడుతున్నాడు. మండే ఎండల ధాటికి మూగ జీవాల నుంచి మనషుల వరకు అందరు విలవిల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే గజ గజ వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది మనుషులు, పశువులు ఎండ ధాటికి మృత్యువాత పడ్డాయి. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ వాళ్లు కూడ హెచ్చరిస్తున్నారు. అయితే ఎండలు ఏ స్థాయిలో ఉన్న.. కొందరు మాత్రం పని చేసుకోక తప్పదు. ముఖ్యంగా రోడ్డ పక్కన అమ్ముకునే వారు, రిక్షవాళ్లు, పొలాల్లో పనులు చేసే వారికి ఎండలో ఉండటం తప్పదు. అయితే ఇలా ఎండలో పనులు చేసే వారికి కొందరు సాయం చేస్తుంటారు.
తాజాగా ఖుషీ పాండే అనే యువతి కూడా అలాంటి సాయం చేసింది. ఎండలో రిక్ష నడుపుతున్న వారి, రోడ్డు పక్కన వివిధ వస్తువులు అమ్ముకుంటున్న వారికి టవల్ పంపిణీ చేసింది. ఎండ తీవ్రత నుంచి వారు తట్టుకునేందుకు సదరు యువతి ఈ ఎర్రని టవల్ ను పంపిణి చేసింది. వాతావరణ శాఖ వారు చెప్పిన సూచనలు, హెచ్చరికలు తను గుర్తుకు వచ్చాయని, అలానే ఎండల్లో పని చేసే వారికి ఇవి పంపిణీ చేస్తున్నట్లు సదరు ఖుషి తెలిపింది. అలానే ఇంకా తాను చాలా మందికి సాయం చేస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువతి చేసిన పనికి అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. ఖుషి పాండే చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
As the Indian Meteorological Department (IMD) issues a heatwave warning, so we have distributed “Gamcha” to rickshaw pullers, Street Vendors who are working hard throughout the day. Our only endeavor is to make things a tad bit comfortable for them. 🥹 pic.twitter.com/O9JjGZXL3A
— Khushi Pandey (@KhushiPand46589) May 24, 2023