సొంత ఇల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల. కానీ.., సొంత ఇంటిని కట్టుకోవడానికి చాలా మందికి ఒక జీవిత కాలం సరిపోతుంది. ఇక మరికొంత మంది అయితే.. సొంత ఇంటిని కట్టుకోలేక జీవితంలో ఆ కోరికని చంపేసుకుంటూ ఉంటారు. కానీ.., మీకు తెలుసా? సొంత ఇంటిని దక్కించుకోవడానికి అడ్డంకి డబ్బు మాత్రమే కాదు.
చేతిలో లక్షలు పెట్టుకుని, చాలా ఏళ్లుగా నచ్చిన ఇల్లు దొరక్క కొంత మంది తిరుగుతూ ఉంటారు. కొంత మంది కష్టపడి ఓ ఇల్లు కొన్నానో, కట్టుకున్నానో అది కలసి రాక, ఖాళీ చేసేస్తుంటారు. మరి కొంత మంది దగ్గర కోట్ల రూపాయల ఆస్థి ఉంటుంది. కానీ.., వారికి మాత్రం సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన రాదు. వేలకి వేలు అద్దె ఇంటికి చెల్లిస్తుంటారు.
ఇక్కడ వీరందరి సమస్య కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆ సమయంలో వారికి గృహ సిద్ది కలగడం లేదు అంతే. ఇలాంటి చెడు సమయాన్ని పోగొట్టే ఒక ఒక శక్తి పరమ శివుడుకి మాత్రమే ఉంది. కేవలం ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే గృహం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మరి ఇందుకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జాతకరీత్యా గృహ యోగం ఉన్నా, లేకపోయినా.. ఇంటి ఇల్లాలు 12 సోమవారాలు శివుడికి జాజిపువ్వులతో పూజ చేస్తే.. గృహ సిద్ది లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీరు ఎలాంటి కష్టం పడకుండా కేవలం శివుడికి పూజ చేసేయండి గృహ సిద్ది కలుగుతుందని మేము చెప్పడం లేదు. కానీ.., శివుని అనుగ్రహం లభిస్తే సొంత ఇంటి కలకి ఎలాంటి ఆటంకాలు రావని చెప్పడమే మా ఉద్దేశం. మరి.. మీ కష్టం మీరు పడుతూ, మీ ప్రయత్నం మీరు చేస్తూ.., ఈ శివ పూజని కొనసాగించండి. మిగిలిన కార్యం ఆ శివయ్యే చూసుకుంటాడు.