ఇటీవలే బృహస్పత్రి మేషరాశిలోకి ప్రవేశించాడు. ప్రతి గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి వెళ్లడమనేది సహజంగా జరుగుతుండే ప్రక్రియ. అలానే గురుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడి.. ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి రానుంది.
ఇటీవలే బృహస్పత్రి మేషరాశిలోకి ప్రవేశించాడు. ప్రతి గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి వెళ్లడమనేది సహజంగా జరుగుతుండే ప్రక్రియ. అలానే గురుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు. అయితే ఇలా గురుడు మేషరాశిలోకి సంచారం చేయడం వలన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం గజలక్ష్మి రాజయోగాన్ని అదృష్ట యోగంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఏర్పడిన ఈ రాజయోగం కారణంగా ఓ ఐదు రాశుల వారికి కనక వర్షం కురవనుందని కొందరు పండితులు చెప్తున్నారు. మరి.. ఆ ఐదు రాశుల వారు ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశివారికి గజలక్ష్మి రాజయోగం కారణంగా అన్నీ శుభాలే జరుగుతాయంట. అలానే ఈ రాశి వారి జాతకంలో పదకొండవ ఇంట్లో బృహస్పతి ఉన్నాడు. దీంతో గజలక్ష్మి రాజయోగం వలన ఈ రాశివారు ధన లాభాలను అందుకుంటారు. అలానే ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గజలక్ష్మీ రాజయోగంతో లాభ పడే రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. ఈ రాశివారి జాతకంలో పడవ ఇంట గజలక్ష్మి యోగం ఏర్పడింది. దీంతో ఈ రాశిలోని వ్యాపార రంగానికి చెందిన వారు పట్టిందల్లా బంగారమే. అలానే ఈ రాశివారు అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశివారు చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
కన్యారాశి రాశివారు జాతకంలో 8వ ఇంట్లో గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ రాశిలోని పెళ్లికాని యువతి యువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు గజలక్ష్మి యోగంవల్ల లాభపడతారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు.
ఈ రాశివారి జాతకంలో 7వ ఇంట గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఆకస్మిక ఆర్థిక లాభం కలగడంతోపాటు గతంలో ఆగిపోయిన పనులన్నీ పునరుద్ధరింపబడతాయి. ఈ రాశివారికి పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది. రాజయోగం కారణంగా ఈ రాశివారు అన్ని విధాలా సహాయం అందుకుంటారు.
మీన రాశి వారికి ద్వితీయ ఇంట్లో గజలక్ష్మి యోగం ఏర్పడింది. సమాజంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక రంగంలో ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలుంటాయి. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులతో పాటు ఆర్ధిక లాభం చేరుకూరుతుంది. ఈ రాశివారికి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది.
అయితే ఈ సమాచారం జ్యోతిశాస్త్ర పండితులు చెప్పిన ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.