నూతన సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1 గుర్తొస్తుంది. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. కానీ.. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండుగ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగియడంతో.. మార్చి 22 నుండి కొత్తగా శ్రీ 'శోభకృత్' నామ సంవత్సరాది ప్రారంభం అవుతుంది.
సాధారణంగా నూతన సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1 గుర్తొస్తుంది. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. కానీ.. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండుగ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగియడంతో.. మార్చి 22 నుండి కొత్తగా శ్రీ ‘శోభకృత్’ నామ సంవత్సరాది ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది ఉగాది పండుగ వచ్చిందంటే చాలు. అందరూ ఈ ఏడాది పంచాంగం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతుంటారు. ఈసారి మొదలవుతున్న శోభకృత్ నామ సంవత్సరం.. తెలుగు వారి 60 సంవత్సరాలలో 37వది. మరి ఈ శోభకృత్ తెలుగు సంవత్సరాదిలో.. వృశ్చిక రాశి వారి పంచాంగం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం!
ఈ కొత్త ఏడాది.. వృశ్చిక రాశివారికి ఎలా ఉండబోతుందో.. ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ప్రదీప్ జోషి.. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో శని, ఐదవ స్థానంలో గురు ఉన్నాయి. వీరికి ఇప్పటివరకు శని గ్రహం అనుకూలంగా ఉంది. ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చేసరికి.. ఇల్లు, భూములు అమ్ముకునే సందర్భాలు రావడమో.. వాహనాలకు ప్రమాదాలు జరగడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో.. ఎలాంటి కష్టం వచ్చినా.. ఇల్లు వాహనాలు అమ్ముకోకూడదు. అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉంటే మంచిది.
ఈ ఏడాది ఎవరినీ అంత ఈజీగా నమ్మకూడదు. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరిగే అవకాశము ఉంది. ఈ ఏడాది అర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే.. పంచమంలో గురు ఉన్నాడు కాబట్టి.. లాభాలు కలిగే ఛాన్స్ కూడా ఉంది. ఈజీ మనీ వైపు వెళ్లకుండా.. కష్టపడి సంపాదించే మార్గాలు ఎంచుకుంటే మంచి లాభాలు చూసే ఆస్కారం ఉంది. వృశ్చిక రాశివారి పిల్లల విషయంలో మంచి జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశికి చెందిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో.. వారు మీ పిల్లలపై ఫోకస్ ఎక్కువగా పెడితే మంచిది. ఈ సంవత్సరం ఈ రాసివారి అదృష్టయోగమంతా మీ పిల్లలకు వచ్చే ఛాన్సు ఉంది. ఈజీ మనీ, అత్యాశ, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వైపు అసలు వెళ్ళకూడదు అని జ్యోతిష్యులు సూచించారు. పూర్తి వివరాల కోసం కింది వీడియోని చూడండి.