తెలుగు వారికి ఉగాది పండుగతోనే కొత్త ఏడాది మొదలవుతుంది. ఈ పండుగ రోజు చాలా మంది తమ రాశిఫలాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తులా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
తెలుగు ప్రజలకు ఉగాది పండగ అంటే వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కొత్త ఏడాది జాతకం. తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే ఉగాది పండుగ నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది మార్చి 22వ తేదీన బుధవారం నాడు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను తెలుగు ప్రజలందరూ జరుపుకోనున్నారు. అందుకే ఉగాది పండుగ అయిన తొలిరోజున ఆలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి? ఏమైనా దోషాలు ఉంటే వాటి నివారణలు కూడా తెలుసుకుంటారు.
వివాహ ప్రయత్నాలు చేయొచ్చా, వ్యాపారం ఎలా ఉంటుంది లాంటివి కూడా ఉగాది రోజు పండితులను అడిగి తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తులా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. తులా రాశి వారికి ఈ సంవత్సరం సమతూకంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి అన్నారు. తులా రాశి వారు లాభంతో పాటు నష్టాలనూ చవిచూడాల్సి వస్తుందన్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తారని చెప్పారు. కాబట్టి ఈ సంవత్సరం తులా రాశి వారు బాగా ఖర్చు పెట్టాలని సూచించారు. విలువైన వస్తువులు కొనడం, విలువైన ప్రదేశాలకు వెళ్లడం చేస్తే బెటర్ అని ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి పేర్కొన్నారు.
‘ఈ ఏడాది పంచాంగం ప్రకారం తులా రాశి వారికి ఐదో ఇంట్లో శని ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారిలో ఎవరైనా 55 ఏళ్లకు పైబడిన వారు ఉంటే.. వాళ్లు తమ పిల్లల గురించి మరీ అంతగా పట్టించుకోకూడదు. పిల్లలతో గొడవలు జరిగే ప్రమాదం ఉంది. అత్తాకోడళ్ల మధ్య చాలా గొడవలు జరుగుతాయి. ఈ సంవత్సరం తులా రాశి వారికి అనుబంధాలు, బాంధవ్యాల్లో తేడాలు వచ్చే ప్రమాదం ఉంది. సంబంధ, బాంధవ్యాల్లో గొడవలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. పార్ట్నర్స్ విషయంలోనూ తేడాలు రావొచ్చు. ఈ విషయాల్లో జాగ్రత్త పడండి. తులా రాశి వారికి ఈ ఏడాది ఆఖరులో అంటే.. నవంబర్, డిసెంబర్ నెలల్లో అదృష్టం బాగా కలిసొస్తుంది. ఏప్రిల్, జులైలో బాగానే ఉంటుంది. తులా రాశి వారు ఫుడ్ బిజినెస్, ల్యాండ్ బిజినెస్ చేయొచ్చు. వస్త్ర వ్యాపారం కూడా వారికి కలిసొస్తుంది. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసినా లాభాలు వస్తాయి. గృహిణులు ట్రేడింగ్ నేర్చుకుంటే బెటర్’ అని జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి వివరించారు.