డబ్బు సంపాదించండమే కాదు.., చేతిలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా దాయడం కూడా ఓ కళ. ఒక్కోసారి అనుకోకుండా చేసే పొరపాట్లకు చాలా నష్టపోతుంటాము. వ్యాపారాలు ప్రారంభించి.., కోలుకోలేని నష్టాలతో రోడ్డుపై పడిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి ఇంత డబ్బు పోతుంటే.. జాగ్రత్తగా ఉండటం ఎలా? మనం ఆర్ధికంగా దిగజారబోతున్న సమయంలో జరిగే కొన్ని పనులు హెచ్చరికలు లాంటివి. వాటి నుండి అయినా మనం జాగ్రత్త పడితే భారీ నష్టాలని తప్పించుకోవచ్చు. మరి ఆ హెచ్చరికలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
1) మీ పర్స్ తరుచుగా మిస్ అవ్వడం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటివి పోగొట్టుకుంటూ ఉంటూ ఉండటం వరుసగా జరుగుతున్నట్టు అయితే అదిరాబోయే మీ పేదరికానికి హెచ్చరిక అని అర్ధం. ఇందులో ఎలాంటి సైన్స్ అద్భుతం లేదు. పర్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటివి డబ్బుకి సంబంధించినవి. ఇవి నిత్యం పోగొట్టుకుంటున్నారు అంటే డబ్బు విషయంలో మీరు చాలా అజాగ్రత్తగా ఉన్నారు అని అర్ధం. ఇలా ఉంటే.., భవిష్యత్ లో పెద్ద కష్టం తప్పదు.
2) జూదం. మీకు గనుక కొత్తగా జూదం అలవాటు అయితే వెంటనే ఆ అలవాటుని మానేయండి. ఎందుకంటే ఒక్కసారి జూదం అలవాటు అయితే ఎంత డబ్బు అయినా కరిగిపోక తప్పదు. జూదం వైపు మీరు ఆకర్షించబడటం కూడా జాగ్రత్తపడమని దేవుడు పంపిన ఓ సిగ్నెల్ గా భావించండి.
3) మీరు మీ స్వహస్తాలతో దేవుడికి పూజ చేసి సంవత్సరాలు గడిచి పోతున్నాయా? కనీసం గుడికి వెళ్ళాలి అన్న ఆలోచన సైతం రావడం లేదా. అయితే.., మీలో ఒక రెక్లెస్ నెస్ వచ్చేసింది. నన్ను ఎవరు ఏమి చేస్తారులే అని ఆ ధిక్కార ధోరణి వల్లే కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఒకవేళ నాస్తికులు అయితే.., కనీసం మీ తల్లిదండ్రులను అయినా నిత్యం పూజించుకోండి. లేదా..? ఈ ధిక్కార ధోరణి వల్ల తీవ్ర ఆర్ధిక నష్టాలు తప్పవు.
4) మీ సంసారం ఎలా ఉంది అనేది మీ ఆర్ధిక స్థితిగతులను నిర్ణయిస్తుంది. మీరు ఇంట్లో భార్యని నిర్లక్ష్యం చేస్తూ.., పరాయి స్త్రీల వైపు ఆకర్షితులు అవుతున్నారు అంటే.. అక్కడ నుండే మీ పతనం ప్రారంభమైనట్టు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు కన్నీటితో ఉంటుందో ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు. ఆ స్త్రీ కన్నీరే అన్నీ కష్టాలని తీసుకొస్తుంది. కాబట్టి.., ఇంట్లో మహిళలని అస్సలు ఏడిపించకండి. మీకు మీ భార్యకి నిత్యం గొడవలు జరుగుతుంటే.. వాటిని కూడా హెచ్చరికలుగా భావించండి.
5) తరుచుగా మోసపోవడం. ఇలాంటి అనుభవం మీకు ఎదురవుతుంటే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీరు అతిగా అందరిని నమ్మేస్తున్నారు. ఇది అతి పెద్ద తప్పు. బిజినెస్ లో దెబ్బ తినేది ఇలా మోసపోయే. కాబట్టి.. ఇలాంటి అనుభవం కూడా మీకు ఎదురవుతుంటే తస్మాత్ జాగ్రత్త.
6) మీరు తరుచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తున్నా.., మీకు త్వరలో ఆర్ధిక కష్టాలు రాబోతున్నాయి అని అర్ధం.ఇందులో కూడా పెద్ద సైన్స్ ఏమి లేదు. మీ ఇంట్లో మీరు ఉంటే ఆలు మగలు ఒకే దగ్గర మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆ సమయంలో మంచి ఆలోచనలు వస్తాయి. ఓ మంచి ఆలోచన మీ ఆర్ధిక స్థితిని మార్చేయవచ్చు.
7) కాలాన్ని ముందే అంచనా వేయడంలో విఫలం అవుతున్నారా? ప్రతిసారి అయ్యో ఇలా చేసి ఉండాకూడదు అని బాధపడుతున్నారా? ఇది కూడా రాబోయే మీ పేదరికాన్ని సూచించే ఓ సూచిక. కాబట్టి.., తప్పు చేశాక కాదు, చేయకముందే కాస్త జాగ్రత్త పడండి.