India Post Recruitment 2022: నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా పోస్ట్ దాదాపు లక్ష ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. పోస్ట్‌మెన్ ఉద్యోగాలు 59,099.. మెయిల్ గార్డ్ పోస్టులు 1445.. ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..
దేశవ్యాప్తంగా 98,083 ఖాళీలు ఉంటే.. వీటిలో ఏపీ సర్కిల్ పరిధిలో 3,573, తెలంగాణ సర్కిల్ పరిధిలో 2,513 ఖాళీలున్నాయి. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
ఆంధ్రప్రదేశ్:
తెలంగాణ:
పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవవాల్సి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఈ నోటిఫికేషన్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Software Jobs: డిగ్రీ అర్హతతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..!
ఇదీ చదవండి: Govt Jobs: 2446 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. పూర్తి వివరాలివే!