ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,106 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీపర్పస్(ఆఫీస్ ఆసిస్టెంట్) ఉద్యోగాలతో పాటు, స్కేల్ 1(అసిస్టెంట్ మేనేజర్),2(మేనేజర్),3(సీనియర్ మేనేజర్) కేడర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
సొంత ఊర్లలోఉంటూ.. దగ్గరలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఇది మంచి సువర్ణావకాశం. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ-పర్పస్), ఆఫీసర్స్(స్కేల్ I) పోస్టులకు పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ కాగా, రెండోది మెయిన్స్. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు, మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ నివేదించిన వాస్తవ ఖాళీల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఇక.. ఆఫీసర్స్ స్కేల్ I పోస్టుల కోసం.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించి, షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్స్ పరీక్ష ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కామన్ ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. మొత్తంగా మెయిన్స్ లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇక.. ఆఫీసర్స్ స్కేల్ II, స్కేల్ III పోస్టుల కోసం, అభ్యర్థులు ఒకే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇక్కడ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కామన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది.మొత్తం పోస్టుల సంఖ్య: 8106
పోస్టుల వివరాలు: ఆఫీస్ ఆసిస్టెంట్(మల్టీపర్పస్): 4483;
ఆఫీసర్ స్కేల్–1( అసిస్టెంట్ మేనేజర్): 2676;
ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్): 867;
ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్): 80.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.06.2022
ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్టు, 2022
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్/అక్టోబర్ 2022
ఇంటర్వ్యూస్ : నవంబర్/డిసెంబర్ 2022
వెబ్‌సైట్: https://www.ibps.in