డిగ్రీ, డిప్లొమా పూర్తి చేశారా? అయితే ఈ బ్యాంకు ఉద్యోగం మీ కోసమే. తెలుగు వస్తే చాలు. అనుభవం లేకపోయినా బ్యాంకులో క్లర్క్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,106 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీపర్పస్(ఆఫీస్ ఆసిస్టెంట్) ఉద్యోగాలతో పాటు, స్కేల్ 1(అసిస్టెంట్ మేనేజర్),2(మేనేజర్),3(సీనియర్ మేనేజర్) కేడర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. సొంత ఊర్లలోఉంటూ.. దగ్గరలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఇది మంచి సువర్ణావకాశం. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ-పర్పస్), ఆఫీసర్స్(స్కేల్ I) పోస్టులకు పరీక్ష రెండు దశల్లో […]