డిగ్రీ, డిప్లొమా పూర్తి చేశారా? అయితే ఈ బ్యాంకు ఉద్యోగం మీ కోసమే. తెలుగు వస్తే చాలు. అనుభవం లేకపోయినా బ్యాంకులో క్లర్క్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులు.
మీరు డిగ్రీ పూర్తి చేశారా? అయితే ఈ బ్యాంకు ఉద్యోగం మీ కోసమే. అనుభవం అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో పలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా మొత్తం 8,612 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 2,3, పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, ఎంబీఏ, సీఏ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.