దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఉద్యోగాల కల్పన లేకపోవడమే.. అందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఈ మధ్యనే.. అగ్నిపథ్ పథకం ద్వారా యువతకు దేశ రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆ వివరాలు..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ‘అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022’ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా, 120 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోస ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు hal-india.co.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 9, 2022.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే.. జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో SSLC లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే.. SC / ST / PWD అభ్యర్థులు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయస్సు15 నుండి 18 సంవత్సరాల మధ్య ఉండాలి. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి, తదనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.