కరోనా మహమ్మారి తర్వాత, చాలా కంపెనీలు తిరిగి ఉద్యోగుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఈ తరుణంలో.. ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 40,000 వేలకు పైగా ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019, 2020 లేదా 2021 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఎస్ లో ఉద్యోగం చేయడం అనేది ప్రతీ ఒక్కరి కల అనే చెప్పాలి. కొందరైతే.. టీసీఎస్ లో ఉద్యోగమంటే.. ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా భావిస్తారు. గతేడాది కూడా టీసీఎస్, ఏకంగా 40 వేల మందిని రిక్రూట్ చేసుకొని సాఫ్ట్ వేర్ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే.. ఈ సంవత్సరం కూడా 40 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు సిద్దమవుతోంది. అంతేకాదు.. క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ ద్వారా మరో లక్ష మందిని రిక్రూట్ చేసుకునే దిశగా టీసీఎస్ ఆలోచిస్తోంది. అర్హతలు: 2019, 2020 లేదా 2021 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు. మినిమం అగ్రిగేట్ మార్కులు 60% లేదా 6 CGPA (X, XII, డిప్లమాతో పాటు అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్టులు) క్వాలిఫికేషన్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. టీసీఎస్ ఉద్యోగాల కోసం అప్ల్య్ చేసేవారు.. nextstep.tcs.com వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండు విభాగాల ద్వారా రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఒకటి ఐటీ ఉద్యోగాలు జాబితా కాగా, రెండోది బీపీవో జాబితా. సంబంధిత విభాగాల్లోకి వెళ్లి మీకు కావాల్సిన జాబ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్: స్టెప్-1: TCS అని టైప్ చేయగానే విండో ఒపెన్ అవుతుంది. దానిలో TCS NextStep మీద క్లిక్ చేయాలి. స్టెప్-2: ఐటీ ఉద్యోగాలు జాబితా/ బీపీవో జాబితా.. మీకు నచ్చింది ఎంచుకోవాలి. స్టెప్-3: రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. సినారియో A: మీరు ఇంతకు ముందే రిజస్టర్ అయి ఉంటే లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సబ్‌మిట్ అయ్యాక అప్లై ఫర్ డ్రైవ్(Apply For Drive) మీద క్లిక్ చేయాలి. సినారియో B: న్యూ యూజర్ అయితే రిజస్టర్ నౌ(Register Now) మీద క్లిక్ చేసి.. ఐటీ కేటగిరీ సెలక్ట్ చేసుకుని.. మీ వివరాలు ఫిల్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేశాకా.. అప్లై ఫర్ డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. స్టెప్-4: తర్వాత మోడ్ ఆఫ్ టెస్ట్ అంటే రిమోట్, ఇన్ సెంటర్ విధానంలో ఏదో ఒకదాన్ని సెలక్ట్ చేసుకుని.. అప్లై బటక్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి టెస్ట్ మోడ్ సెలక్ట్ చేసుకుంటే.. మళ్లీ మార్చుకోవడానికి అవకాశం లేదు. స్టెప్-5: స్టేటస్ కన్ఫామ్ చేసుకోవడానికి ట్రాక్ యువర్ అప్లికేషన్‌ని చెక్ చేయండి. స్టేటస్‌లో అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇదీ చదవండి: Job Mela: హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 80కి పైగా కంపెనీలు.. 7 వేలకు పైగా ఉద్యోగాలు! ఇదీ చదవండి: Govt Jobs: 2446 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. పూర్తి వివరాలివే!