రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, సరుకు రవాణా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ సహా అనేక సేవలను అందించే భారతీయ రైల్వేస్ యొక్క క్రిటికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం, మ్యానేజ్ చేయడం వంటి సేవలను అందిస్తోంది సీఆర్ఐఎస్. అయితే మరింత మెరుగైన సేవలను అందించేందుకు సీఆర్ఐఎస్ సిద్ధమైంది. న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, సికింద్రాబాద్ జోన్లలో పని చేసేందుకు ప్రతిభావంతులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి? జీతం ఎంత? ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.