21 ఏళ్ల కుర్రాడు యశస్వి జైస్వాల్ కేక పుట్టించే బ్యాటింగ్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏకంగా కింగ్ కోహ్లీకే టెండర్ పెట్టేలా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ లో ఆడాలనేది దాదాపు ప్రతి క్రికెటర్ కల. ఎందుకంటే ఈ లీగ్ లో బాగా ఆడితే నలుగురి కంట్లో పడతాం. తమపై కోట్లకు కోట్లు పెడతారని చాలామంది ప్లేయర్స్ భావిస్తుంటారు. అందుకు తగ్గట్లే ధనాధన్ బ్యాటింగ్ మాత్రమే చేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం జాతీయ జట్టులో చోటు సంపాదించడం కోసం ఆడుతూ ఉంటారు. ఈసారి ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ లు చూస్తుంటే అదే అనిపిస్తుంది. తాజాగా తన మనసులో మాట కూడా బయటపెట్టేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ పేరు చెప్పగానే అందరికీ అందరికీ ముంబయి, చెన్నై, ఆర్సీబీ ఇవే గుర్తొస్తాయి. కానీ ఈసారి గుజరాత్, రాజస్థాన్ లాంటి జట్లు తమ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. గుజరాత్ అంటే ఎలానూ డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి ఓకే. రాజస్థాన్ మాత్రం స్లో పాయిజన్ లా పైకొచ్చేస్తుంది. ప్రత్యర్థి జట్లకు షాకిస్తుంది. తాజాగా కోల్ కతా మ్యాచ్ లో అయితే 150 పరుగుల టార్గెట్ ని కేవలం 13.1 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఇక్కడ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేక పుట్టించే బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 98 పరుగులు చేశాడు.
మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నా. ఈసారి ఇండియాలో ఇది అవుతోంది. ఇదే నా డ్రీమ్. రోహిత్ భయ్యా దీన్ని పరిగణలోకి తీసుకుంటాడని అనుకుంటున్నాను’ అని యశస్వి జైస్వాల్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఆ స్థానంలో కోహ్లీ ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా రేసులో ఉన్నాడు. వీళ్లని దాటుకుని జైస్వాల్ కి ఛాన్స్ దొరుకుతుందా అంటే డౌట్ అనిపిస్తుంది. కానీ కోహ్లీ ప్లేస్ కి యశస్వి జైస్వాల్ టెండర్ పెట్టినట్లే కనిపిస్తున్నాడు. అది బీసీసీఐతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తలుచుకుంటే అయ్యే ఛాన్సు ఉంటుంది. మరి జైస్వాల్ బ్యాటింగ్, లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
Thope a thop antundu inka manam em cheptham 💥 #yashaswijaiswal pure mass pic.twitter.com/ZgEgM7CXc3
— THE JohnSnow (@JohnSnow007_) May 11, 2023