ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్ లోనే ఘోరంగా విఫలమైంది. రాజస్థాన్ చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఈ ఓటమిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం ఓడిపోవడం మన మంచికేలే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో సీజన్ ని ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ తో తలపడిన తొలి మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కలిసి కట్టుగా విఫలమయ్యారు. పేలవ ప్రదర్శనతో 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. ఈ మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం నెట్టింట ఒక సెంటిమెంట్ తెగ వైరల్ అవుతోంది. ఆ సెంటిమెంట్ గనుక ఈసారి రిపీట్ అయితే SRH కప్పు కొట్టడం ఖాయమనే చెప్పాలి. మరి ఆ సెంటిమెంట్ ఏంటి? ఎందుకు అభిమానులు ఇంత నమ్మకంగా ఉన్నారు?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈసారి కప్పు కొట్టే జట్టు ఇదే అని ముందే ఊహాగానాలు చేశారు. కానీ, అన్నింటినీ తలకిందులు చేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. ఈసారి జట్టు పగ్గాలను మార్కరమ్ తీసుకోనున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ కూడా హైదరాబాద్ జట్టులో చేరారు. నెదర్లాండ్స్- సౌత్ ఆఫ్రికా సిరీస్ కారణంగా వీళ్లు మొదటి మ్యాచ్ కి అందుబాటులో లేరు. ఇప్పటికే మార్కరమ్ మ్యాచ్ లో విజయం సాధించేందుకు వ్యూహాలు, కసరత్తు కూడా ప్రారంభించాడు.
IPL 2014 – SRH finished in 6th place
IPL 2015 – SRH finished in 6th place
IPL 2016 – SRH won the 🏆IPL 2021 – SRH finished in 8th place
IPL 2022 – SRH finsihed in 8th place
IPL 2023 – SRH 🏆 ?— Saideep 🇮🇳 (@saideep1501) April 4, 2023
ఈ మ్యాచ్ మాత్రమే కాదు.. కప్పు కొట్టేది కూడా మనమే అంటూ సన్ రైజర్స్ అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. అయితే వాళ్లేమీ ఊరికే ఆ మాటలు అనడంలేదు. అందుకు కొన్ని లెక్కలు కూడా చూపిస్తున్నారు. 2014, 2015 సీజన్లో సన్ రైజర్స్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. తర్వాత 2016లో ట్రోఫీ సొంతం చేసుకుంది. 2021, 2022 సీజన్లలో 8వ స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో కప్పు కొడతాం అంటున్నారు. అలాగే కప్పు కొట్టిన 2016, ఐపీఎల్ 2023 సీజన్లో ఆడిన నాలుగో మ్యాచ్ లో 200 పరుగులు ఛేజ్ చేస్తూ ఓటమి పాలైంది. అలాగే 2009లో డెక్కన్ ఛార్జస్ కప్పుకొట్టింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత SRH కప్పుకొట్టింది. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత SRH కప్పు కొట్ట బోతోందని చెబుతున్నారు. ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
IPL 2009- Deccan Chargers won the 🏆
-After 7 yrs-
IPL 2016- SRH won the 🏆
-After 7 yrs-
IPL 2023- SRH will win the 🏆 😎Sorry MS, but IPL 2023 is ours 🤞
— Abhi- SRH Lover (@Abhinav62396774) April 4, 2023