IPL, KKR: ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్‌కు దూరం కావడంతో కష్టాల్లో ఉన్న కేకేఆర్.. మరో ఇద్దరు ఆటగాళ్లు దూరం అవ్వడంతో మరిన్ని కష్టాల్లో పడింది. మరి ఆటగాళ్లు ఎవరు? ఎందుకు దూరం అయ్యారో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్‌లో షకీబ్ అల్ హసన్ చాలా కాలంగా ఆడుతున్నాడు. అయితే ఈసారి అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న లిట్టన్ దాస్ తొలి సారి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రూ.50 లక్షల కనీస ధరకు ఈ బంగ్లా స్టార్ ఓపెనర్ ని కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ, లీగ్ ప్రారంభమై ఒక మ్యాచ్ ముగియగానే.. బంగ్లా ప్లేయర్లు ఐపీఎల్ కి దూరమవుతున్నారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజ్ ఇబ్బందుల్లో పడింది. షకీబ్‌తో పాటు లిట్టన్ దాస్ సైతం కేకేఆర్‌లోనే ఉన్నారు. బీసీబీ నిర్ణయంతో కేకేఆర్ యాజమాన్యం అసహనం వ్యక్తం చేస్తుంది.
ఇటీవలే ఐర్లాండ్ టీంతో బంగ్లాదేశ్ మూడు టీ 20 మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ని బంగ్లాదేశ్ 2-1 తేడాతో సొంతం చేసుకోగా.. ప్రస్తుతం ఐరీష్ జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇదివరకు.. “వేలం సమయంలో మా ఆటగాళ్లు పూర్తి స్థాయిలో కాకపోయినా.. కొన్ని ఐపీఎల్ మ్యాచులకి అందుబాటులో ఉంటారు”. అని ప్రకటించింది. ఐర్లాండ్ తో టీ 20 ముగియగానే షకీబ్ ఐపీఎల్ కి జట్టులో చేరతాడని కేకేఆర్ యాజమాన్యం ప్రకటింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బంగ్లా క్రికెట్ బోర్డు ఐర్లాండ్ జట్టు మీద ఒక టెస్టుతో పాటు ఏప్రిల్ 9-14 మధ్య మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ వన్డే జట్టుకి కెప్టెన్ గా ఉంటున్న షకీబ్ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇదే సమయంలో మరో కేకేఆర్ ఆటగాడు లిట్టన్ దాస్ కూడా బంగ్లా జట్టులో కీలక ప్లేయర్ కాబట్టి అతను కూడా ఐపీఎల్ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ట్రోర్నీకి దూరమై కష్టాల్లో ఉన్న సమయంలో ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లు దూరం కావడంతో కేకేఆర్ మరింత ఇబ్బందుల్లో పడింది. షకీబ్ దూరం అవ్వడంతో ఇప్పుడు కేకేఆర్ జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య మరింతగా తగ్గనుంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ పలు ఫ్రాంఛైజీలు బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆటగాళ్లను పంపకుండా ఐపీఎల్ సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచులు పెట్టుకోవడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లను బాయ్ కాట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా బంగ్లా క్రికెట్ బోర్డు చేసిన పనికి ఫ్రాంచైజీల వాదనకి మరింత బలం చేకూరింది. 2024 బంగ్లాదేశ్, శ్రీలంక టీమ్ ప్లేయర్ల విషయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి షకీబ్ 2023 ఐపీఎల్ కి దూరమవ్వడం కేకేఆర్ జట్టు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కామెంట్ల రూపంలో తెలపండి.
International commitments and ‘personal issues’ have forced Shakib Al Hasan to pull out of his #IPL2023 stint with KKR ❌ pic.twitter.com/m3tUvHBbED
— ESPNcricinfo (@ESPNcricinfo) April 3, 2023