Rohit Sharma, MS Dhoni: ధోని వల్ల కాలేనిది.. అప్పట్లోనే రోహిత్ సాధించాడంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. కానీ.. ప్రస్తుతం ధోని వయసు 41 ఏళ్లు. పైగా గాయంతో బాధపడుతూ మ్యాచ్ ఆడాడు. అప్పటికీ.. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను గెలిపించేంత పని చేశాడు.
ఐపీఎల్ 2023లో అన్ని మ్యాచ్‌లు దాదాపు అన్ని మ్యాచ్‌లు థ్రిల్లర్ సినిమాలను మంచి జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సైతం హైఓల్టేజ్‌లా సాగింది. మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్లిన మ్యాచ్‌లో చివరకు రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించినా.. ధోని బ్యాటింగ్‌తోనే మ్యాచ్ హైలెట్‌గా మారింది. కేవలం 12 బంతుల్లో 40 పరుగుల కావాల్సిన పరిస్థితి నుంచి 3 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన స్థితికి మ్యాచ్‌ను తెచ్చాడు ధోని. దీంతో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌దే అనుకున్నారంతా.. కానీ, అనూహ్యాంగా ఫలితం వేరేలా వచ్చింది.
అయితే.. చివరి ఓవర్‌ను రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ అద్భుతంగా వేశాడు. చెన్నైకి చివరి 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. స్ట్రైక్‌లో ధోని ఉన్నాడు. ఎదురుగా వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ఉండటంతో సందీప్ శర్మ కాస్త ఒత్తిడికి గురయ్యాడు. తొలి రెండు బంతులను వైడ్‌గా వేయడంతో ఒక్క బంతి కూడా కాకుండానే.. చెన్నైకి ఫ్రీగా రెండు రన్స్ వచ్చాయి. కానీ.. వెంటనే అద్భుతమైన యార్కర్‌తో సందీప్ యార్కర్ వేసి.. వైడ్ల వల్ల కలిగిన నష్టాన్ని తగ్గించాడు. కానీ.. రెండు, మూడు బంతుల్లో ధోని తన విశ్వరూపం చూపించాడు. లో ఫుల్‌టాస్ బంతులను భారీ సిక్సులకు మలిచి.. విజయ సమీకరణాన్ని 3 బంతుల్లో 7 పరుగులకు మార్చేశాడు.
ఇక చెన్నై విజయం ఖాయమనుకున్నారంతా.. కానీ.. సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో రెండు బంతులను ధోనినే ఫేస్ చేశాడు. కానీ.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. కానీ.. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రోహిత్ శర్మ మాత్రం 21 పరుగులు బాదేశాడు. 2009 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్-దక్కన్ ఛార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛార్జర్స్ విజయానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాలి. అప్పుడు దక్కన్ ఛార్జర్స్‌కు ఆడుతున్న రోహిత్ స్ట్రైక్‌లో ఉన్నాడు. కేకేఆర్ బౌలర్ మోర్తాజ వేసిన ఓవర్‌లో రెండు ఫోరు, రెండు సిక్సులు బాది ఛార్జర్స్‌ను గెలిపించాడు. లాస్ట్ బాల్‌కు సిక్స్ బాది మరీ గెలిపించాడు.
అయితే.. ఇప్పుడు ధోని 6 బంతుల్లో 21 పరుగులు చేయలేకపోవడంతో.. అప్పుడు రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని వల్ల కాలేనిది.. అప్పట్లోనే రోహిత్ సాధించాడంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. కానీ.. ప్రస్తుతం ధోని వయసు 41 ఏళ్లు. పైగా గాయంతో బాధపడుతూ మ్యాచ్ ఆడాడు. అప్పటికీ.. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను గెలిపించేంత పని చేశాడు. ధోని ఇన్నింగ్స్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను పోల్చడం అర్థం లేని పని అంటూ మరికొంత మంది క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ONCE UPON A TIME 🫶🏻
Rohit Sharma 🤯🔥 https://t.co/8n2XIL5BWM
— Middle Stump Cricket (@MiddleCricket) April 13, 2023