Ravi Shastri, Sourav Ganguly: ఇప్పటికే సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదంతో సతమతమవుతున్న క్రికెట్ అభిమానులకు రవిశాస్త్రి వ్యాఖ్యలు మరింత చిరాకు తెప్పించేలా ఉన్నాయి. అసందర్భంగా రవిశాస్త్రి.. గంగూలీ విషయంలో పిచ్చివాగుడు వాగాడు.
భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై నోరు పారేసుకున్నాడు. ఇప్పటికే గంగూలీని విరాట్ కోహ్లీ అవమానించాడనే విషయంపై క్రికెట్ అభిమానులు మండిపడుతుంటే.. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గంగూలీని అవమానించేలా కోహ్లీ ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. గంగూలీని కోపంగా చూడటం, మ్యాచ్ ముగిసిన తర్వాత.. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ముఖం తిప్పేసుకున్న ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇప్పటికే ఈ వివాదంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుచస్తుంటే.. పానకంలో పుడకలా రవిశాస్త్రి గంగూలీ గురించి పిచ్చి వాగుడు వాగాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అంచుకు చేరుకున్న సమయంలో.. ‘బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ఈ పదవితో తన స్థాయి పెరిగిందని అనుకుంటున్నాడేమో? డైరెక్టర్ పదవి పేరుకే ఉంటుంది కానీ అధికారం ప్రదర్శించే వీలు ఉండదు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. గంగూలీ నామ్‌కే వాస్తే ఢిల్లీ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్నాడని కానీ, అధికారం చెలాయించేది మొత్తం పాంటింగ్ అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. కోహ్లీ-గంగూలీ వివాదం తర్వాత రవిశాస్త్రి కావాలనే ఇలా మట్లాడాడంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. కోహ్లీకి రవిశాస్త్రి క్లోజ్ అనే విషయం తెలిసిందే.
అయితే.. టీమిండియా కెప్టెన్‌గా, ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా చేసిన గంగూలీకి ఏ పదవి పెద్దదో ఏ పదవి పెద్దది కాదో తెలియదా? అది నువ్వు చెప్పాలా? అంటూ క్రికెట్ అభిమానులు రవిశాస్త్రిపై విరుచుకుపడుతున్నారు. అయినా.. దాదా అడుక్కుంటే డైరెక్టర్ పదవి రాలేదని.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం వచ్చి రిక్వస్ట్ చేస్తేనే డీసీ జట్టు డైరెక్టర్‌గా ఉండేందుకు గంగూలీ ఒప్పుకున్నాడని అంటున్నారు. ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు గంగూలీ అంటూ విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతో పాటు దాదా సత్తా ఏంటో తెలిసి బతిమాలి మరీ డైరెక్టర్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ అండతో టీమిండియాకు హెడ్ కోచ్ అయి.. ఆ తర్వాత మళ్లీ మైక్ పట్టుకున్న రవిశాస్త్రి లాంటి వాళ్లు గంగూలీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘He must have thought it’s nice upstairs’ – Ravi Shastri takes a dig at Sourav Ganguly after DC’s fifth consecutive loss https://t.co/LWNGWidc50 pic.twitter.com/apG0rJKFxr
— CrickTale Official (@CricktaleO) April 17, 2023