టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా తాను క్రికెట్ ఆడే రోజుల్లో మైదానంలో ఎంతో సరదాగా ఉండేవాడు. తోటి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ, తుంటరి పనులు చేస్తూ ఉండేవాడు. అయితే కోచ్ అయ్యాక కూడా ఆయన తీరులో మార్పు రావడం లేదు. ఇప్పుడు కూడా అంతే సరదాగా ఉంటున్నాడు.
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కప్‌ను ఒడిసిపట్టిన గుజరాత్ టైటాన్స్.. ఈసారి అదే దూకుడును ప్రదర్శిస్తోంది. సొంత మైదానమా? లేదా వేరే మైదానమా? ప్రత్యర్థి ఎవరు, పిచ్ ఎలా ఉంది లాంటి వాటితో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. తొలుత బ్యాటింగ్ చేసినా లేదా ఛేజ్ చేసినా గుజరాత్‌దే గెలుపు అనేలా పరిస్థితులు ఉన్నాయి. లీగ్‌ను ఘనంగా ఆరంభించిన ఆ జట్టుకు మధ్యలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఒక పరాజయం, ఆ తర్వాత మరో ఓటమి తప్పితే ఎక్కడా బ్రేకులు పడలేదు. మొదటి అంచెలో రింకూ సింగ్ ఊచకోత ఇన్నింగ్స్‌తో కాస్త డీలాపడ్డ గుజరాత్.. ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో రెండింట్లో మాత్రమే ఓడిన ఆ జట్టు.. ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో నెగ్గిన గుజరాత్ టైటాన్స్.. ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 7 వికెట్లు నష్టపోయి 179 రన్స్ చేసింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ (81) ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు స్కోరు బోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది. ఆ తర్వాత ఆండ్రీ రస్సెల్ (34) తప్పితే మిగతా వారు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమి మూడు వికెట్లతో రాణించాడు. ఛేదనలో టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (10) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. సాహా ఎక్కువ రన్స్ చేయకున్నా మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (49), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (26) కలసి గుజరాత్‌ను ఆదుకున్నారు.
అనంతరం త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ (51), డేవిడ్ మిల్లర్ (32)లు హార్డ్ హిట్టింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో గుజరాత్ టీమ్‌తో పాటు జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా సంతోషంలో మునిగిపోయారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు నెహ్రా చేసిన ఒక తుంటరి పనికి టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చాలా ఇబ్బంది పడ్డాడు. యాంకరిగ్ చేస్తున్న కార్తీక్ ప్రైవేట్ పార్ట్‌పై నెహ్రా సరదాగా తన్నాడు. అయితే తగలరాని చోట బలంగా తగలడంతో నొప్పిని భరించలేక తల్లడిల్లిపోయాడు కార్తీక్. నేలపై కూర్చుండిపోయిన అతడ్ని మళ్లీ నెహ్రానే లేపాడు. ఆ తర్వాత నెహ్రాను మురళీ కార్తీక్ తిరిగి తన్నే ప్రయత్నం చేయగా.. అతడు తప్పించుకున్నాడు. గ్రౌండ్లో నెహ్రా చేసిన ఈ ఊహించని ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏంటి నెహ్రా జీ.. కోచ్ అవతారం ఎత్తాక కూడా సరదా పనులు ఆపరా? మీ తమాషా పనులు ఇంకొకరికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని గుర్తుంచుకోండి అంటూ ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Typical Nehraji !
Boys Ft Ashish Nehra and Murali Karthik
This is how boys meet 😂
Video from Jio cinema#AshishNehra #muralikarthik#KKRvsGT #TATAIPL2023 #AndreRussell pic.twitter.com/IIX3riMS4Y— Cricket Enthusiast (@tarunreddyoo7) April 29, 2023