పదహారో సీజన్ ఐపీఎల్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ వివాదాల్లో ముఖ్యంగా కోహ్లీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గంగూలీతో ఆపై గంభీర్‌తో అతడు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. వీటిని పక్కనబెడితే.. ధోని రిటైర్మెంట్ అంశం కూడా ఈ సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 మొదలైనప్పటి నుంచి ఒక విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్. ఈ సీజన్ అతడికి చివరిది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ధోని శరీరం సహకరించడం లేదని, ఇకపై అతడు ఆడడని క్రికెట్ విశ్లేషకులు కామెంట్లు చేస్తుండటాన్ని చూస్తున్నాం. సీఎస్కే హోమ్ గ్రౌండ్‌లోనే కాకుండా బయటి మ్యాచులకు కూడా ప్రేక్షకుల తండోపతండాలుగా వస్తున్నారు. తనకు వీడ్కోలు చెప్పేందుకు వస్తున్నారంటూ ధోని చెప్పడం.. ఇన్‌డైరెక్టుగా రిటైర్మెంట్పై హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరోసారి తన రిటైర్మెంట్పై ధోని ఇంట్రెస్టింగ్ కామంట్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది.
లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ నెగ్గిన ధోని తాము తొలుత బౌలింగ్ చేస్తామని వెల్లడించాడు. వర్షం పడినందున గ్రౌండ్లో కవర్స్ కప్పారు, కాబట్టి తాము మొదట బౌలింగ్ చేస్తామన్నాడు. దీపక్ చాహర్ ఫిట్‌గా ఉన్నాడని సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఆకాష్ స్థానంలో అతడు ఆడతాడని తెలిపాడు. అయితే మీ చివరి సీజన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కామెంటేటర్ ప్రశ్నించగా.. మీరంతా ఇది నా చివరి ఐపీఎల్ అని డిసైడ్ అయ్యారన్న ధోని.. తాను మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఈ కామెంట్స్‌తో ధోని ఇప్పట్లో రిటైర్ కాడని తేలిపోయింది. మరి.. ధోని తన వ్యాఖ్యలపై నిలబడతాడో లేదా సడన్ షాక్ ఇచ్చి ఆటకు వీడ్కోలు చెబుతాడో చూడాలి.
MSD keeps everyone guessing 😉
The Lucknow crowd roars to @msdhoni's answer 🙌🏻#TATAIPL | #LSGvCSK | @msdhoni pic.twitter.com/rkdVq1H6QK
— IndianPremierLeague (@IPL) May 3, 2023