MS Dhoni: టేబుల్ టాపర్‌గా ఉన్న చెన్నై.. గురువారం రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. అయితే ఈ ఓటమికి ధోని తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణమంటూ సీఎస్‌కే అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్ కంటే ముందు వరకు టేబుల్ టాపర్‌గా ఉన్న చెన్నై.. రాజస్థాన్ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన చెన్నై.. ఊహించని విధంగా దారుణ ఓటమిని చవిచూసింది. అయితే.. ఈ ఓటమికి ధోనినే కారణమంటూ చెన్నై అభిమానులే ఆరోపించడం గమనార్హం. ధోని తీసుకున్న తప్పుడు నిర్ణయంతోనే రాజస్థాన్ చేతిలో చెన్నై ఓటమి పాలైందని సోషల్ మీడియా వేదికగా సీఎస్‌కే అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ధోని అభిమానుల కోపానికి గురయ్యేంతా పెద్ద తప్పు ధోని ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెన్నై బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అదరగొట్టాడు. చివర్లో ధృవ్ జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 34, పడిక్కల్ 13 బంతుల్లో 27 పరుగులు చేయడం రాజస్థాన్‌కు భారీ స్కోర్ దక్కింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్నే అందించారు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ 47 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ డెవాన్ కావ్వె 8 పరుగులకే అవుటైనా.. తొలి వికెట్‌కు వీరద్దరూ కలిసి 42 పరుగులు జోడించారు.
ఆ తర్వాత చెన్నై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 69కి రుతురాజ్, 73కి రహానే, 73కి రాయుడు అవుట్ కావడంతో చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్‌కు దిగుతాడని అంతా భావించారు. ఒక ఎండ్‌లో యువ క్రికెటర్ శివమ్ దూబే బాగా బ్యాటింగ్ చేస్తుండంతో ధోని కూడా జత కలిస్తే.. చెన్నైకి విజయం పెద్ద విషయం కాదని క్రికెట్ అభిమానులు భావించారు. పైగా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా బాగుంటుందని అనుకున్నారు. కానీ, ధోని మాత్రం డగౌట్‌లో కూర్చోని మొయిన్ అలీ, జడేజాలను బ్యాటింగ్‌కు దింపాడు. వాళ్లు అన్నో ఇన్నో పరుగులు చేసినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు.
వారి స్థానంలో ధోని రాకుండా.. అల్రెడీ క్రీజ్‌లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండగా.. మళ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను పంపడంపై ధోని అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 2011లో ధోని తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రస్తావిస్తున్నారు. శ్రీలంకతో జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ కంటే ముందు ధోని బ్యాటింగ్‌కు వచ్చి.. చివరి వరకు ఉండి మ్యాచ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. టీమిండియా సెహ్వాగ్, సచిన్, కోహ్లీ వికెట్లు కోల్పోయిన తర్వాత.. ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే క్రీజ్‌లో గంభీర్ ఉన్నాడు. నిజానికి కోహ్లీ అవుట్ తర్వాత యువరాజ్ బ్యాటింగ్‌కు రావాల్సింది. కానీ, అప్పటికే క్రీజ్‌తో గంభీర్ రూపంలో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండటంతో యువీని కాదని తాను బ్యాటింగ్‌కు వచ్చాడు. అది ఎంత అద్భుత ఫలితాన్ని ఇచ్చిందో మనకు తెలిసిందే.
అలాంటి ధోని.. ఇప్పుడు ఎందుకు అలా ఆలోచించలేదు అంటూ సీఎస్‌కే అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. క్రికెట్ కెరీర్‌కు చివరి దశలో ఉన్న ధోని.. కావాలనే బ్యాటింగ్‌కు ముందుగా దిగడం లేదని, ఏదో అభిమానులను అలరించేందుకు చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు కానీ, 5 లేదా 6 ఓవర్ల ఆట మిగిలి ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం, అవసరం రెండూ ఉన్నా.. ధోని బ్యాటింగ్‌కు రావడం లేదని, మ్యాచ్ తాను గెలిపించలేనేమో అని ధోని భయపడుతున్నాడంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మరి రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమితో పాటు ధోని బ్యాటింగ్‌కు రాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Why does the Sawai Mansingh Stadium remain special for @msdhoni? 🤔
Here’s what he said 🔽#TATAIPL | #RRvCSK pic.twitter.com/u4ApgNZHDC
— IndianPremierLeague (@IPL) April 27, 2023