Mohit Sharma: రూ. 6 కోట్ల ప్లేయర్ నుంచి నెట్ బౌలర్ గా మారాడు మోహిత్. అయితే ఇందుకు అతడు బాధపడలేదు. పడ్డ చోటే లేవాలనే కసితో ప్రాక్టీస్ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో..
జీవితం సాఫీగా సాగిపోతే మజా ఏముంటుంది చెప్పండి. అప్పుడప్పుడు కష్టాలు, కన్నీళ్లు, ఎదురుదెబ్బలు తగిలితేనే మనం రాటుదేలుతాం. అచ్చం అలానే రాటుదేలాడు టీమిండియా బౌలర్ మోహిత్ శర్మ. 2016లో రూ.6.5 కోట్లకు పంజాబ్‌కు అమ్ముడుపోయాడు. అయితే ఈ సీజన్‌లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు మోహిత్ శర్మ. 2014లో పర్పుల్ క్యాప్ విన్నర్ గా నిలిచిన మోహిత్ శర్మ.. 2015 వరల్డ్ కప్ కు ఎంపికైయ్యాడు. ఆ తర్వాత గాయం కారణంగా జట్టు నుంచి దూరం అయ్యాడు మోహిత్. దాంతో ఒక్కసారిగా అతడి కెరీర్ డ్రాప్ అయ్యింది. రూ. 6 కోట్ల ప్లేయర్ నుంచి నెట్ బౌలర్ గా మారాడు మోహిత్. అయితే ఇందుకు అతడు బాధపడలేదు. పడ్డ చోటే లేవాలనే కసితో ప్రాక్టీస్ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను పొందాడు.
మోహిత్ శర్మ.. 2014లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. దాంతో 2015 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు. కానీ గాయం కారణంగా జట్టు నుంచి దూరం అయ్యాడు. ఇక 2020 ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్ కు పూర్తిగా దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఐపీఎల్ మినీ వేలం 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టు అతడిని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది మోహిత్ శర్మ గుజరాత్ నెట్ బౌలర్ గా సేవలు అందించాడు. అయితే తాను నెట్ బౌలర్ గా సేవలు అందించినందుకు బాధపడటం లేదని తెలిపాడు. ఇక ఐపీఎల్ తో తొలి మ్యాచ్ లోనే సత్తా చాటడంతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు మాజీలు. ఇక తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటుగా.. కీలకమైన జితేశ్ శర్మ, సామ్ కర్రన్ వికెట్లు తీసుకున్నాడు. దాంతో పంజాబ్ తక్కువ స్కోరు కే పరిమితం అయ్యింది.
ఇక మ్యాచ్ అనంతరం మోహిత్ శర్మ మాట్లాడుతూ..”నేను డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాను అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందులో ఆశిష్ నెహ్రా ఒకడు. దాంతో అతడు కాల్ చేసి గుజరాత్ జట్టుకు నెట్ బౌలర్ గా సేవలు అందించాలని చెప్పాడు. నేను కూడా చేసేది ఏమీ లేదు కాబట్టి.. సరే అన్నాను. అయితే నేను నెట్ బౌలర్ గా మారినందుకు నాకు బాధలేదు” అని చెప్పుకొచ్చాడు మోహిత్ శర్మ. ఇక తన రీ ఎంట్రీ వెనక, విజయం వెనక ఆశిష్ నెహ్రా ఉన్నాడు అంటూ అతడికి ధన్యవాదాలు తెలియజేశాడు మోహిత్ శర్మ. ఒకప్పుడు ధోని ఫేవరెట్ బౌలర్ గా ప్రశంసలు పొందిన మోహిత్ శర్మ.. ఇప్పుడు కేవలం రూ. 50 లక్షల ప్లేయర్ గా మారడం గమనార్హం. అయితే జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి అని ఈ సందర్బంగా మోహిత్ చెప్పుకొచ్చాడు.
Mohit Sharma, whose last regular IPL season was in 2018, spent 2022 as a net bowler with Gujarat Titans.
He made a return against Punjab Kings last night, and he seemed to be the same bowler he has always been, writes @the_kk
👉 https://t.co/Rp4DccIJSx #PBKSvGT #IPL2023 pic.twitter.com/CtKOU3LuQw
— ESPNcricinfo (@ESPNcricinfo) April 14, 2023