కోహ్లీతో గొడవని ఇంకా పెద్దది చేసుకోవడం ఎందుకని లక్నో అనుకున్నట్లు ఉంది. అందుకే ఫైనల్ గా కాంప్రమైజ్ కి వచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ ట్వీట్ చేసింది.
ఐపీఎల్ లీగదశ ఈసారి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా సాగింది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టే జట్లు ఏవి అనేది చివరి మ్యాచ్ వరకు కన్ఫర్మ్ కాలేదు. ఫైనల్ గా గుజరాత్, చెన్నై, లక్నో, ముంబయి టాప్-4లో నిలిచాయి. కప్ కోసం పోటీపడనున్నాయి. ఇదంతా పక్కనబెడితే లీగ్ దశలో లక్నో-ఆర్సీబీ మ్యాచ్ మాత్రం హైలెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు కోహ్లీ-గంభీర్-నవీన్ ఉల్ హక్ గొడవ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ఇష్యూపై లక్నో టీమ్ కాళ్ల బేరానికొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా క్రికెటర్లు మాటామాట అనుకోవడం కొత్తేం కాదు. ఈసారి ఐపీఎల్ లో లక్నో-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో గంభీర్, నవీన్ ఉల్ హక్ గొడవపడ్డారు. లక్నో టీమ్ ని వాళ్ల సొంతగడ్డపై బెంగళూరు ఓడించేసరికి తట్టుకోలేకపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే టైంలో కోహ్లీపై లక్నో బౌలర్ నోరు పారేసుకున్నాడు. ఆ తర్వాత సీన్ లోకి గంభీర్ ఎంట్రీ ఇచ్చి హీట్ ని మరింత పెంచాడు. ఈ మ్యాచ్ తర్వాత కూడా పరోక్షంగా ఈ ప్లేయర్లు.. ఇన్ స్టా వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు.
ఇలా ఈ గొడవలో ఎవరూ తగ్గకపోయేసరికి లక్నో మేనేజ్ మెంట్ ఫైనల్ గా కాళ్ల బేరానికి వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, దీన్ని ఇంతటితో వదిలేద్దాం అనేలా ట్వీట్ పెట్టింది. వచ్చే సీజన్ లో కలుసుకుందాం అని రాసుకొచ్చింది. వచ్చే సీజన్ లో కోహ్లీ, గంభీర్ కచ్చితంగా ఉంటారు. కానీ నవీన్ ని లక్నో జట్టులో ఉంచుతారా? తీసేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే కావాలని కోహ్లీతో గొడవ పెట్టుకోవాలని ఏ ఫ్రాంచైజీ అనుకోదు. లక్నో కూడా ఇదే విషయం ఆలోచిస్తే.. వచ్చే సీజన్ లో నవీన్ ఉన్నాసరే అతడిని బెంచ్ కి పరిమితం చేయొచ్చనిపిస్తోంది. మరి కోహ్లీతో గొడవపై లక్నో కాంప్రమైజ్ కావడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Give it? Take it? Let’s leave it. 🤝
Well fought, @RCBTweets. See you next season. 🤙
— Lucknow Super Giants (@LucknowIPL) May 21, 2023