గంభీర్ తో తాజాగా జరిగిన గొడవపై కోహ్లీ స్పందించాడు. పేరు చెప్పకపోయినా సరే ఇన్ డైరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడ అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఐపీఎల్ అంతా ఓ ఎత్తయితే.. నిన్న జరిగింది మరో ఎత్తు. ఎందుకంటే ఆర్సీబీ vs లక్నో మ్యాచ్ అలా జరిగింది. ఇందులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు అనేది పక్కనబెడితే.. కోహ్లీ-గంభీర్ గొడవపడటం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. చెప్పాలంటే పెద్ద రచ్చకు కారణమైంది. ఏదో స్లెడ్జింగ్ వరకు ఓకే గానీ ఏకంగా కొట్టుకునేంత వరకు వీళ్లిద్దరూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఇష్యూ జరగడం కాదు.. దీనిపై కోహ్లీ స్పందించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ ఇద్దరూ టీమిండియా క్రికెటర్లే. 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. కారణమేంటనేది పక్కనబెడితే ఆ తర్వాతే గొడవలే స్టార్ట్ అయ్యాయి. 2013 ఐపీఎల్ లో ఓ మ్యాచ్ సందర్భంగా చాలా పెద్దగా గొడవపడ్డారు. అప్పుడు ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్న కోహ్లీ, కేకేఆర్ కెప్టెన్ అయిన గంభీర్ తీవ్రస్థాయిలో మైదానంలో ఒకరిపై ఒకరు ఎగిరిపడ్డారు. ఆ తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్.. ప్రస్తుతం లక్నో జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ సీజన్ లో కొన్నిరోజుల ముందు ఆర్సీబీ మ్యాచ్ లో లక్నో గెలిచింది. అప్పుడు ఫ్యాన్స్ నోరు మూసుకోండి అన్నట్లు గంభీర్ సైగ చేసి చూపించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ.. ఇప్పుడు అంతకంతా బదులిచ్చాడు. దీంతో బీసీసీఐ వీళ్లిద్దరికీ 100 శాతం మ్యాచ్ ఫీజ్ కోత విధించింది. ఇప్పుడు దీనిపై స్పందించిన కోహ్లీ.. ‘మీరు వినేదంతా అభిప్రాయం మాత్రమే, నిజం కాదు. మీరు చూసేదంతా ఓ కోణం మాత్రమే, నిజం కాదు’ అని తన ఇన్ స్టా స్టోరీలో ఓ కోట్ పోస్ట్ చేశాడు. ఆర్సీబీ టీమ్ పోస్ట్ చేసిన మరో వీడియోలో అయితే.. ‘తీసుకోగలిగే దమ్ము ఉంటేనే నాతో పెట్టుకోండి. లేదంటే అస్సలు నాతో పెట్టుకోవద్దు’ అని కౌంటర్ ఇస్తూ కనిపించాడు. ఇవన్నీ ఇన్ డైరెక్ట్ గా గంభీర్ కి కౌంటర్స్ అని తెలుస్తోంది. గొడవపడి, దానిపై కోహ్లీ స్పందించడం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
View this post on Instagram
A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)