చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచులో గెలిచిన జోష్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఐపీఎల్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది గుజరాత్ టైటాన్స్ జట్టు. తొలి మ్యాచులోనే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. అన్ని విభాగాల్లోనూ రాణించి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ఈ విజయంతో టోర్నీలో దూసుకుపోయేందుకు ఉరకలేస్తోంది. అయితే ఈ సమయంలో ఆ జట్టుకు చేదు వార్త. గుజరాత్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. సీఎస్కేతో జరిగిన మ్యాచులో కేన్ మామ గాయపడిన సంగతి విదితమే. చెన్నై బ్యాటింగ్ సమయంలో 12.5వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ స్క్వేర్ లెగ్ దిశగా ఒక భారీ షాట్ కొట్టాడు. అందరూ అది సిక్సర్ వెళ్లిందని భావించారు. అయితే అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ బాల్ కోసం కాచుకుని ఉన్నాడు.
క్యాచ్ పట్టుకునేందుకు మంచి టైమింగ్‌తో జంప్ చేశాడు విలియమ్సన్. గాల్లోకి చాలా ఎత్తు ఎగిరిన అతడు బాల్ బౌండరీకి వెళ్లకుండా క్యాచ్ పట్టాడు. అయితే కాలు బౌండరీ లోపల పెట్టినట్లు అనిపించడంతో బాల్‌ను బయటకు విసిరి.. తన కుడి కాలితో ల్యాండ్ అయ్యాడు. చాలా ఎత్తు నుంచి ఒక్క కాలిపై ల్యాండ్ అవ్వడంతో మోకాలు ట్విస్ట్ అయింది. అంతే వెంటనే గ్రాండ్లో కుప్పకూలాడు కేన్‌మామ. నొప్పిని భరించలేక కాసేపు విలవిల్లాడాడు. దీంతో అక్కడికి గుజరాత్ టీమ్ ఫిజియోలు వచ్చి కేన్ కాలిని స్ట్రయిట్ చేశారు. గతంలో గాయమైన కుడి కాలికే ఇప్పుడు మళ్లీ ఇంజ్యురీ అవ్వడంతో విలియమ్సన్కు మోకాలి భాగంలో లిగ్మెంట్ ఏదైనా ఫ్రాక్చర్ అయ్యిందా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ అది నిజమైతే విలియమ్సన్ మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
Kane Williamson ruled out of IPL 2023. (Source – Sports Tak)
— Johns. (@CricCrazyJohns) April 1, 2023