CSK vs RCB Prediction: ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉన్న సీఎస్‌కే-ఆర్సీబీ.. మూడో విజయం కోసం పోటీ పడుతున్నాయి. మరి ఈ పోటీ ఎవరు గెలుస్తారంటే??
ఐపీఎల్ 2023లో సోమవారం బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఢీ కొననుంది. ఈ మెగా ఫైట్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌గా కాకుండా.. ధోని వర్సెస్ కోహ్లీ మ్యాచ్‌గా చూస్తున్నారు ఫ్యాన్స్. ధోని, కోహ్లీ ఆడే చివరి మ్యాచ్‌గా దీన్ని చూస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో ఇప్పుడు చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
ప్రస్తుతం ఇద్దరు ఓపెనర్లు ఫామ్‌లో ఉండటంతో చెన్నై బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. కాన్వె, రుతురాజ్‌తో పాటు రహానే మంచి టచ్‌లో ఉన్నారు. అయితే మిడిల్దార్‌లో మొయిన్ అలీ విఫలం అవుతుండటం కాస్త ఇబ్బంది పెడుతోంది. చివర్లో రాయుడు, ధోని, జడేజా పరుగులు చేస్తూ.. చెన్నైకు బలంగా మారారు. బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్న చెన్నై బౌలింగ్‌లో అంతా బలంగా కనిపించడం లేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు..
కోహ్లీ-డుప్లెసిస్ జోడీ ఈ సీజన్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ పేయిర్‌గా ఉంది. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. అయితే వీరిద్దరిపైనే ఆర్సీబీ ఎక్కువ ఆధారపడినట్లు కనిపించడం కలవరపెట్టే అంశం. బౌలింగ్ ఎటాక్ చూసేందుకు పటిష్టంగా ఉన్నా.. ప్రదర్శనలో మాత్రం దారుణంగా నిరాశపరుస్తున్నారు. ఢిల్లీపై విజయం సాధించిన జోష్‌లో ఉన్నా.. కొన్ని లోపాలు మాత్రం ఉన్నాయి.
తుది జట్ల అంచనా..
RCB: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మహిపాల్ లోమ్‌రోర్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వాన్ పార్నెల్, సిరాజ్, విజయ్‌కుమార్
CSK: రుతురాజ్ గైక్వాడ్, కావ్వె, అజింకా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, జడేజా, ధోని, ప్రిటోరియస్, మహీష తీక్షణ, తుషార్ దేశ్‌పాండే.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించే అవకాశం ఉంది.
“1️⃣ Age-old rivalry. ⚔️
2️⃣ Seasoned teams. 💪🏼
💯% EXCITEMENT GUARANTEED! ✅Which team will leave the other to bite the dust?
Tune-in to #RCBvCSK on #IPLonStar
Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#GameOn #BetterTogether” pic.twitter.com/MpJXUUGaB2— Star Sports (@StarSportsIndia) April 17, 2023