ఆర్సీబీ-సీఎస్‌కే జట్టు ఎప్పుడు తలపడినా చూసేందుకు అభిమానులు రెడీగా ఉంటారు. ఈ దక్షిణాది జట్ల పోరాటం కొదమసింహాల కొట్లాటను తలపిస్తుంది. సోమవారం రాత్రి మరోమారు ఇది నిరూపితమైంది.
ఐపీఎల్ కప్ కొట్టేది ఎవరంటే.. చాలామంది ముంబయి, చెన్నై జట్ల పేర్లు చెబుతారు. దరిద్రానికి కేరాఫ్ ఎవరూ అంటే తడుముకోకుండా అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ ఆర్సీబీ. మరి ఈ జట్టు దరిద్రం ఎందుకు మారట్లేదు?
CSK vs RCB Prediction: ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉన్న సీఎస్‌కే-ఆర్సీబీ.. మూడో విజయం కోసం పోటీ పడుతున్నాయి. మరి ఈ పోటీ ఎవరు గెలుస్తారంటే??
ఎంసీఏ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపొందడంతో డ్రెస్సింగ్ రూంలో సందడి నెలకొంది. ఆటగాళ్లంతా ఒక్కచోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాక్స్‌వెల్.. విరాట్ కోహ్లిని ఆటపట్టించాడు. రనౌట్‌ను గుర్తుచేస్తూ ‘‘అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. సింగల్ వచ్చేదగ్గర రెండు తీయగలవు, […]
టీమిండియా మాజీ సారధి, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లిపై అభిమానులు మండిపడుతున్నారు. ‘నీ ప్రవర్తన ఇక మారదా?’’.. నీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడే పరిస్థితి తెచ్చావంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక.. ధోని ఫ్యాన్స్ అయితే కోహ్లిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘పులి ముందే పిల్లి గంతులా.. నీ స్థాయి ఏమిటో నిరూపించుకున్నావు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్-2022లో భాగంగా పూణేలోని ఎంసీఏ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, […]
మేము మనసు పెట్టి ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించగలమని ఆర్సీబీ మరోమారు నిరూపించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టింది. హ్యాట్రిక్ ఓటములకు ఫుల్‌స్టాప్ పెడుతూ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకొని.. ప్లే ఆప్స్ రేసులో నిలిచింది. బ్యాటింగ్‌లో తడబడినా.. బౌలర్ల ప్రతిభతో అద్భుత విజయాన్ని అందుకుంది.ఎంసీఏ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు అభిమానులను […]
శివమ్ దూబే.. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శివతాండవం ఆడాడు. గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో నాలుగు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022లో తొలి విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 36 పరుగులకే రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే 10వ ఓవర్ వరకు ఆచితూచి ఆడారు. 10 ఓవర్లు […]
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి గెలుపును నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి నాలుగు వరుస ఓటముల తర్వాత బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మాస్టర్ మైండ్ ధోని మరోసారి తన మార్క్ కెప్టెన్సీని ప్రదర్శించాడు. లక్ష్యం భారీగా ఉన్నా.. కోహ్లీ లాంటి ఆటగాడు ఇలాంటి పిచ్‌పై కుదురుకుంటే.. ఎంతటి లక్ష్యంమైన చిన్నబోతుందన్న విషయం బాగా తెలిసిన ధోని.. కింగ్ కోహ్లీ కోసం ఒక పద్మవ్యూహాన్నే […]