ఐపీఎల్-2023 లాస్ట్ ఫైట్‌కు టైమ్ దగ్గరపడుతోంది. మరికొన్ని గంటల్లో జరగబోయే ఈ తుది సమరంలో గెలిచి కప్ ఒడిసిపట్టాలని హోమ్ టీమ్ గుజరాత్‌తో పాటు చెన్నై కూడా ఆశిస్తోంది. అయితే ఒక సెంటిమెంట్ చెన్నైదే ఈసారి కప్ అని చెబుతోంది. అదేంటంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫైనల్స్‌కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ నడుమ ఆదివారం రాత్రి టైటిల్ ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ లాస్ట్ ఫైట్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. వరుసగా రెండో సంవత్సరం టైటిల్‌ను పట్టేయాలని గుజరాత్ టైటాన్స్ ఆశిస్తోంది. మరోవైపు చెన్నై ఎలాగైనా ఐదో కప్‌ను తమ అకౌంట్లో వేసుకోవాలని కలలు కంటోంది. మొదట్లో వరుస ఓటములు పలకరించినా నిరాశపడకుండా.. ఒక్కో మ్యాచ్‌లో గెలుస్తూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది చెన్నై. మరో ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్‌ను క్వాలిఫయర్-1లో చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సీఎస్కే అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.
ఒక దశలో బ్యాట్ టు బ్యాక్ పరాజయాలతో డీలాపడ్డ సీఎస్కే.. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టంగా కనిపించింది. కానీ సారథి ధోని అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వాడుకుంటూ, తన కెప్టెన్సీ స్కిల్స్‌తో జట్టును ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మరోవైపు గ్రూపు దశలో అదరగొట్టిన గుజరాత్.. ప్లేఆఫ్స్‌లో చెన్నై మీద తడబడి ఓడింది. కానీ క్వాలిఫయర్-2లో ముంబైపై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకుంది. ప్లేఆఫ్స్‌లో చెన్నైపై ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆ జట్టు కృతనిశ్చయంతో ఉంది. అయితే ఒక సెంటిమెంట్ మాత్రం సీఎస్కేకు అనుకూలంగా ఉంది. భారత్‌లో 2011 వరల్డ్ కప్ జరిగిన ఏడాది.. ఐపీఎల్లో చెన్నై ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ ఏడాది ముంబై ఇండియన్స్‌ను క్వాలిఫయర్-2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఆ సీజన్లో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఫస్ట్ ప్లేసులో, చెన్నై రెండో స్థానంలో నిలిచాయి.
ఐపీఎల్-2011లో క్వాలిఫయర్-1లో నెగ్గి సీఎస్కే నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. ఆర్సీబీ క్వాలిఫయర్-2లో ముంబైని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో చెన్నై చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ ఏడాది కూడా అచ్చం 2011లోలాగే ముంబై ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్-2లో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈసారి కూడా 2011లోలాగే వరల్డ్ కప్ భారత్‌లో జరగడం, పాయింట్ల పట్టికలో రెండో ప్లేసులో ఉన్న సీఎస్కే ఫైనల్‌కు చేరుకోవడం.. అదే విధంగా టేబుల్ టాపర్ గుజరాత్ చేతిలో ముంబై ఓడిపోవడం జరిగాయి. ఐపీఎల్-2011 ఫైనల్లో ఆర్సీబీని ఓడించి చెన్నై కప్ ఒడిసిపట్టింది. ఈ ఒక్క సెంటిమెంట్ కూడా రిపీటైతే ఈసారి కూడా టైటిల్ విన్నర్ సీఎస్కేనే అని చెప్పొచ్చు. మరి.. ఈ సెంటిమెంట్ రిపీటై చెన్నై కప్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.