పంజాబ్-గుజరాత్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023వ సీజన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కొన్ని మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు నమోదు అవుతూ.. అసలు సిసలైన క్రికెట్ మజాను ఫ్యాన్స్ కు అందిస్తోంది ఈ సీజన్. అయితే భారీ స్కోర్లు నమోదు అయిన మ్యాచ్ లే కాకుండా లో స్కోరింగ్ మ్యాచ్ లు కూడా అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా గురువారం రాత్రి పంజాబ్-గుజరాత్ జట్ల మధ్య పోరు క్రికెట్ లవర్స్ ను అలరించింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్ పై గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్ల మధ్య ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ దృశ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ వేస్తున్న సమయంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ వేయడానికి ఇద్దరు కెప్టెన్స్ గ్రౌండ్ లోకి వచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపు పాండ్యా, ధావన్ లు మాట్లాడారు. అనంతరం శిఖర్ ధావన్ ను హాగ్ చేసుకున్నాడు పాండ్యా. ఆ తర్వాత అతడి చెంపపై ముద్దు పెట్టాడు. ఇక ఈ దృశ్యం చూసిన ఫ్యాన్స్ కు ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. మ్యాచ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే పాండ్యాలో మరో కోణం బయటపడింది. ఈ సీజన్ లో ధావన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అయితే జోషువా లిటిల్ బౌలింగ్ లో అల్జారీ జోషెఫ్ కు క్యాచ్ ఇచ్చి 8 పరుగులకే వెనుదిరిగాడు ధావన్.
దాంతో పాండ్యాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. భీకర ఫామ్ లో ఉన్న గబ్బర్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో.. సంతోషాన్ని పట్టలేక గట్టిగా అరిచాడు పాండ్యా. ఇక ఈ సంఘటనను చూసిన ప్రేక్షకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అదేంటి పాండ్యా కొన్ని నిమిషాల ముందే ముద్దు పెట్టుకున్నావ్.. ఇప్పుడు అవుట్ కాగానే ఇంతలా అరుస్తున్నావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇది గేమ్.. ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగాక, తమ్ముడైనా శత్రువే అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ జట్టు 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. పంజాబ్ జట్టులో మథ్యూ షార్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువగా.. గుజరాత్ టీమ్ లో శుభ్ మన్ గిల్ 67 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Hardik Pandya with Shikhar Dhawan.
What a lovely picture! pic.twitter.com/eb1jcVBTjb
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023