ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో పెద్ద ఎత్తున గొడవ జరగడం అందరినీ షాక్ కి గురి చేసింది. తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే వీరిద్దరు ఇలా ప్రవర్తించడం ఎవ్వరికీ నచ్చడం లేదు. ఈ విషయంపై ప్రస్తుతం వీరిద్దరిపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వీరిద్దరి వివాదంపై భారత మాజీ క్రికెటర్ స్పిన్నర్ హర్భజన్ స్పందించాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న లక్నో సూపర్ జయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. మ్యాచ్ సంగతి అలా ఉంచితే పెద్ద ఎత్తున గొడవ జరగడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇప్పటికీ ఈ వార్ నడుస్తూనే ఉంది. ఈ మ్యాచులో వరుస పెట్టి వికెట్లు తీస్తూ ఆర్సీబీ టీమ్ విజయానికి చేరువలో ఉంది. ఇక మిగిలి ఉంది టైలెండర్లే కావడంతో కోహ్లీ సెలెబ్రేషన్ హద్దుమీరాయి. ఈ దశలో నవీన్ ఉల్ హక్ కోహ్లీ ఒకరికొకరు గొడవకి దిగడంతో అంపైర్లు వీరి గొడవని ఆపేసారు. ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో కోహ్లీ-గంభీర్ ల మధ్య గొడవ మొదలైంది.
మ్యాచ్ అనంతరం కోహ్లీ.. కైల్ మేయర్స్ తో మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి మేయర్స్ ని తీసుకెళ్లడంతో వీరిద్దరి ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఎవరూ తగ్గకపోవడంతో ఈ గొడవ క్రమంగా పెద్దదిగా మారింది. చిన్న పిల్లలాగా వీరిద్దరూ వాగ్వాదానికి దిగి ఐపీఎల్ కి స్థాయినే కాదు వారి స్థాయిని కూడా కాస్త దిగజార్చుకున్నారు. తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే వీరిద్దరు ఇలా ప్రవర్తించడం ఎవ్వరికీ నచ్చడం లేదు. ఈ విషయంపై ప్రస్తుతం వీరిద్దరిపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వీరిద్దరి వివాదంపై భారత మాజీ క్రికెటర్ స్పిన్నర్ హర్భజన్ స్పందించాడు.
హర్భజన్ మాట్లాడుతూ.. “గంభీర్ కోహ్లీ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారు. ఇద్దరు కూడా ఒకప్పుడు కలిసి ఆడి భారత్ కి వరల్డ్ కప్ అందించారు. వీరిద్దరూ కలిసి క్రికెట్ కి ఒక మంచి సందేశం ఇవ్వాలి గాని ఇలా గొడవపడటం క్రికెట్ కి ఏ మాత్రం మంచిది కాదు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే నాకు తెలియదు కానీ .. వీరిద్దరూ అలా చేయకుండా ఉండాల్సింది కాదు. గతంలో నేను శ్రీశాంత్ ని చెంపదెబ్బ కొట్టిన విషయంలో ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను”. అని ఈ విషయంపై విచారణ వ్యక్తం చేసాడు. గతంలో(2013) కూడా కోహ్లీ గంభీర్ వివాదం అప్పట్లో సంచలనంగా మారింది. మళ్ళీ తాజాగా మరోసారి వివాదానికి తెరలేపారు. మరి రాను రాను రోజుల్లో వీరిద్దరి మధ్య గొడవ ఎంతవరకెళ్తుందో చూడాలి. మరి వీరిద్దరి గొడవ విషయంలో హర్భజన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.