Virat Kohli, Gautam Gambhir: ఇద్దరూ ఒక నగరానికి చెందిన ఆటగాళ్లు అయినా.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా మళ్లీ వీరిద్దరి
ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ తర్వాత గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ మధ్య పెద్ద గొడవ జరిగింది. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. అయితే.. ఇద్దరూ ఢిల్లీకి చెందిన ఆటగాళ్లే అయినా, టీమిండియాకు చాలా ఏళ్లపాటు కలిసి ఆడినా వీరి మధ్య ఇలా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఎందుకు మారిందో చాలా మందికి అర్థం కావడంలేదు. గతంలో కూడా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ప్రతి ఐపీఎల్‌లో గంభీర్-కోహ్లీ ఎదురుపడుతున్నారంటేనే ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది. మొదటి సారి గొడవ ఎప్పుడు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
2009లో భారత్-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్‌లో టీమిండియా 316 పరుగుల భారీ స్కోర్ ఛేదించి గెలిచింది. ఆ మ్యాచ్‌లో గంభీర్-కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. నిజానికి వాళ్లిద్దరూ కలిసే ఆ మ్యాచ్‌ను గెలిపించారు. 316 పరుగుల భారీ స్కోర్ ఛేదించే క్రమంలో సెహ్వాగ్ 10, సచిన్ 8 పరుగులు మాత్రమే చేసిన అవుటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన గంభీర్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్య నెలకొల్పాడు. ఏకంగా 220 పరుగులకు పైగా భారీ పార్ట్నర్ షిప్ బిల్డ్ చేసి.. టీమిండియాను గెలిపించాడు. గంభీర్ 137 బంతుల్లో 14 ఫోర్లతో 150 పరుగులు చేశాడు. అలాగే కోహ్లీ సైతం 114 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 107 రన్స్ చేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గంభీర్.. కోహ్లీకి ఇవ్వాలని కోరాడు. నిర్వాహకులు గంభీర వినతి మన్నించి ఆ అవార్డును కోహ్లీకి అందించాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో అది తొలి సెంచరీ కావడంతో గంభీర్ అలా చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందనుకున్నారు.
కానీ, 2013లో ఐపీఎల్ సందర్భంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్– కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఢిల్లీ ఆటగాళ్లు ఇలా గొడవ పడటం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పుడు ఇద్దరూ కెప్టెన్లే. పైగా ఇద్దరూ అగ్రెసివ్ ఆటగాళ్లే. దీంతో.. వారిద్దరి ఆపడం ఎవరి తరం కాలేదు. 2013లో జరిగిన గొడవ తర్వాత.. వారిద్దరూ సరదాగా ఏనాడు మాట్లాడుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి గంభీర్.. కోహ్లీని విమర్శిస్తూ వచ్చాడు. కోహ్లీ మాత్రం గంభీర్ గురించి ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2013 తర్వాత మళ్లీ సరిగ్గా పదేళ్లకు ఇద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లు అంతా వచ్చి.. ఆపాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే.. ఈ గొడవ ముందు గంభీర్-కోహ్లీ మధ్య జరగలేదు. కోహ్లీ-నవీన్‌ఉల్ హక్ మధ్య జరిగింది. ఈ గొడవలో గంభీర్ దూరాడు. మరి ఈ వీరిద్దరి మధ్య పదేళ్లుగా రగులుతున్న గొడవ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Heated conversation between Virat Kohli and Gautam Gambhir. pic.twitter.com/69VR0EIWv2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2023
10 year challenge between Virat Kohli and Gautam Gambhir.
2013 2023 pic.twitter.com/jTXBq5gree
— Akshat (@AkshatOM10) May 1, 2023