చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ తిప్పలు తప్పట్లేదు. అది కూడా కెప్టెన్ ధోనీ వల్ల. మనోడినే టార్గెట్ చేసి మరీ భయపెడుతున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
దిగ్గజ ధోనీతో కలిసి ఆడాలని, అతడు కెప్టెన్సీ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉండాలని ప్రతి ప్లేయర్ కోరుకుంటాడు. ఈ లిస్టు తీస్తే మనోళ్లు మాత్రమే కాదు.. విదేశీ క్రికెటర్లు కూడా ఉంటారు. అలా ధోనీ జట్టులో ఉన్నాడంటే ఆ బ్యాటర్ లేదా బౌలర్ ఎవరైనా సరే చాలా ఫేమ్ తెచ్చుకుంటాడు. మిగతా వాళ్ల గురించి పక్కనబెడితే ప్రస్తుతం సీఎస్కేకి ఆడుతున్న రుతురాజ్, దీపక్ చాహర్,శివమ్ దూబే, మహేష్ పతిరానా ఇలా చాలామందే ఉన్నారు. అయితే ధోనీ వల్ల ప్లస్ లే కాదు అప్పుడప్పుడు కష్టాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా బలైపోతున్నాడు చెన్నై బౌలర్ దీపక్ చాహర్. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఇంత క్రేజ్ తెచ్చుకోవడానికి, ఇప్పటివరకు నాలుగుసార్లు విజేతగా నిలవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ధోనీ. ఒకవేళ ఇతడు ఆ జట్టులో లేకపోయినా, కెప్టెన్ కాకపోయినా పరిస్థితి వేరేలా ఉండేది! సరే ఇదంతా ఎందుకులే గానీ మేటర్ లోకి వచ్చేద్దాం. ధోనీ మైదానంలో కూల్ గా ఉంటాడు. బయటమాత్రం ఇంకాస్త ఫన్నీగా, జోకులేస్తూ అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన చాలా వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. వాటితో పోలిస్తే రీసెంట్ గా బయటకొచ్చిన వీడియోలు నెక్స్ట్ లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాయి.
సరిగ్గా మూడు వారాల క్రితం ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై 8 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆ రోజు డగౌట్ లో ఉన్న ధోనీ బ్యాటుని గాల్లో ఊపుతూ ప్రాక్టీసు చేశాడు. పక్కనే కుర్చీపై ఉన్న దీపక్ చాహర్.. తనకు అది తగులుతుందేమోనని భయపడిపోయాడు. ఇప్పుడు అదే చాహర్ ని ధోనీ మరోసారి ఆటపట్టించాడు. తాజాగా దిల్లీతో మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత ధోనీ పెవిలియన్ వైపు వెళ్తూ చెంప కొట్టేస్తా అన్నట్లు చేయితో అన్నాడు. దీంతో ఈసారి కూడా చాహర్ భయపడిపోయాడు. ఇలా ప్రతిసారి చాహర్ బలైపోతుండటం చూసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. సో అదనమాట విషయం. మరి ధోనీ-చాహర్ ని టార్గెట్ చేసి మరీ ఆటపట్టిస్తుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Hahah! looks like Dhoni likes to toy around Deepak chahar always 🤣🤣🤣#CSKvDC #MSDhoni pic.twitter.com/ifoYHL1a2W
— Gnanashekar (@Gnanashekar) May 10, 2023