ఇప్పటికే జిడ్డు ఇన్నింగ్స్ లు ఆడుతూ.. జట్టు ఓటములకు కారణం అవుతున్న వేళ.. తన దురుసుతనాన్ని చూపించాడు వార్నర్. అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన యంగ్ ప్లేయర్ పై కోపంతో ఊగిపోవడం ఏంటి అంటూ వార్నర్ పై విరుచుకుపడుతున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం వార్నర్, లలిత్ యాదవ్ పై ఓవర్ యాక్షన్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా క్రీడల్లో ఆటగాళ్లు సహనం కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక సహనం కోల్పోయిన ఆటగాళ్లు ఆ టైమ్ లో తమ నోటికి పని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో డేవిడ్ వార్నర్ ఓవర్ యాక్షన్ చేశాడు. క్లిష్టమైన రన్ కోసం లలిత్ యాదవ్ ను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. అతడిపై నోరు జారాడు. ఇప్పటికే జిడ్డు ఇన్నింగ్స్ లు ఆడుతూ.. జట్టు ఓటములకు కారణం అవుతున్న వేళ.. తన దురుసుతనాన్ని చూపించాడు వార్నర్. దాంతో నువ్వు హాఫ్ సెంచరీలు చేసినంత మాత్రాన జట్టుకు ఒక్కపైసా లాభం లేదు అంటూ విమర్శిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. పైగా అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన యంగ్ ప్లేయర్ పై కోపంతో ఊగిపోవడం ఏంటి అంటూ వార్నర్ పై విరుచుకుపడుతున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం వార్నర్, లలిత్ యాదవ్ పై ఓవర్ యాక్షన్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటముల పరంపర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో సైతం చేజేతులా మ్యాచ్ ను జారవిడుచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో వార్నర్ చేసిన అతికి అభిమానులు తిట్టిపోస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే? ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. గ్రీన్ వేసిన ఈ ఓవర్ లో వార్నర్ మిడ్ ఆఫ్ దిశగా భారీ షాక్ ఆడాడు. అయితే ఆ బాల్ నేరుగా పియూష్ చావ్లా మీదుగా వెళ్లబోయింది. ఇక చావ్లా ఆ బాల్ ను పట్టుకునే ప్రయత్నంలో క్యాచ్ జారింది. అప్పటికే వార్నర్ ఇది చూస్తూనే కష్టమైన రన్ కు ప్రయత్నించి.. పరుగు కోసం పిచ్ మధ్యలోకి వచ్చాడు. అయితే బాల్ చావ్లా చేతికి తాడకడంతో.. నాన్ స్ట్రైక్ లో ఉన్న లలిత్ యాదవ్ పరుగుకు నిరాకరించాడు. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చిన వార్నర్.. లలిత్ పై కోపంతో ఊగిపోయాడు. ఆ తర్వాత లలిత్ పరుగు పూర్తి చేశాడు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాడంతో.. ఇటు ఢిల్లీ ఫ్యాన్స్, అటు క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్ ను తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే? లలిత్ యాదవ్ ను తిడదానికి వార్నర్ అప్పటికే భీకర ఇన్నింగ్స్ ఆడటంలేదు. పైగా గత కొన్ని మ్యాచ్ ల్లో జిడ్డు బ్యాటింగ్ తో ఢిల్లీ ఓటములకు కారణం అవుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. ఇక అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన యంగ్ ప్లేయర్ కు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తడిని దూరం చేయాల్సి పోయి.. లేని పరుగుకోసం అతడిని తిట్టడం ఏంటి? అంటూ వార్నర్ పై గరం అవుతున్నారు ఫ్యాన్స్. వార్నర్ నీకు అంత సీన్ లేదు.. ఢిల్లీ ఓటములకు అసలు కారణం నువ్వే అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. మరి లలిత్ యాదవ్ పై వార్నర్ ఓవర్ యాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— IPLT20 Fan (@FanIplt20) April 11, 2023