ఇప్పటికే జిడ్డు ఇన్నింగ్స్ లు ఆడుతూ.. జట్టు ఓటములకు కారణం అవుతున్న వేళ.. తన దురుసుతనాన్ని చూపించాడు వార్నర్. అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన యంగ్ ప్లేయర్ పై కోపంతో ఊగిపోవడం ఏంటి అంటూ వార్నర్ పై విరుచుకుపడుతున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం వార్నర్, లలిత్ యాదవ్ పై ఓవర్ యాక్షన్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.