సాధారణంగా అంపైర్ లు గ్రౌండ్ లో ఎలాంటి భావోద్వేగాలను చూపించారు. భారీ సిక్సర్లు, స్టన్నింగ్ క్యాచులు పట్టిన ఇవేమి మాకు కొత్త కాదు అనేలా ఉంటారు. ముఖంలో ఎలాంటి హావభావాలను చూపించకుండా చాలా స్ట్రిక్ట్ గా, ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. అయితే నిన్న మ్యాచులో ఒక క్యాచ్ అంపైర్ నే అవాక్కయేలా చేసింది.
ఇప్పటికే జిడ్డు ఇన్నింగ్స్ లు ఆడుతూ.. జట్టు ఓటములకు కారణం అవుతున్న వేళ.. తన దురుసుతనాన్ని చూపించాడు వార్నర్. అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన యంగ్ ప్లేయర్ పై కోపంతో ఊగిపోవడం ఏంటి అంటూ వార్నర్ పై విరుచుకుపడుతున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. ప్రస్తుతం వార్నర్, లలిత్ యాదవ్ పై ఓవర్ యాక్షన్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.