చెన్నై vs గుజరాత్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? అంటే నెటిజన్స్ అవుననే అంటున్నారు. అందుకు సంబంధించిన ఫ్రూఫ్స్ ని బయటపెడుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై సూపర్ కింగ్స్.. క్వాలిఫయర్-1లో గెలిచింది. ఏకంగా 10వ సారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన సీఎస్కే.. 172 పరుగుల స్కోరు చేసింది. దీంతో గుజరాత్ గెలుపు కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్, ఈ సీజన్ లోనూ సక్సెస్ లతో మంచి ఊపు మీద కనిపించడం దీనికి కారణం. కానీ ధోనీసేన చేతిలో ఈ టీమ్ ఓడిపోయింది. చాలామంది ధోనీని ఆకాశానికెత్తేస్తున్నారు. కొందరు మాత్రం ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని అంటున్నారు. ఏదో ఊరికే అనడం లేదని, తమ దగ్గర ఫ్రూప్స్ కూడా ఉన్నాయని చూపిస్తున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణమైంది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో గతంలో ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన కారణంగా చెన్నై, రాజస్థాన్ జట్లను 2015-16 సీజన్లలో ఆడనీయకుండా చేశారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ జట్లు ఐపీఎల్ ఆడుతున్నాయి. రాజస్థాన్ గురించి పెద్దగా మాట్లడరు గానీ చెన్నై ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచ్ లు గెలిస్తే మాత్రం ఫిక్సింగ్, ఫిక్సింగ్ అని ఓ బ్యాచ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. తాజాగా గుజరాత్ పై క్వాలిఫయర్-1లో సీఎస్కే గెలిచేసరికి సేమ్ కామెంట్స్ రిపీట్ చేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. విజయ శంకర్ క్యాచ్ పట్టిన రుతురాత్ ని ఇందులో టార్గెట్ చేస్తున్నారు.
గుజరాత్ జట్టులోని ఆల్ రౌండర్ అయిన విజయ్ శంకర్.. ఈ మ్యాచ్ లో 14 రన్స్ కొట్టి ఔటయ్యాడు. పతిరానా బౌలింగ్ లో రుతురాజ్ కి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్యాచ్ లో బంతి నేలని తాకినా సరే ఔట్ ఇచ్చారని, అలానే మిల్లర్, తెవాటివా కావాలనే ఔట్ అయిపోయారని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ సీజన్ లో అంపైర్లు తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. బహుశా నిన్న కూడా అలానే జరిగి ఉండొచ్చనిపిస్తోంది. చెన్నై బౌలర్లు ఈ మ్యాచ్ లో చాలా చాకచక్యంగా బౌలింగ్ చేయడం.. విజయానికి కారణమైంది. సో అదనమాట విషయం. మరి చెన్నై-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అంటూ వస్తున్న ఆరోపణలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Vijay Shankar Wicket Qualifier 1 – GT vs CSK #ipl #VijayShankar #csk #gt #cricket #Jio #dhobi #fixing#mudgalreport #cskban #india #rituraj #gujarat #mi #mumbaiindians pic.twitter.com/xqRmMndMfN
— Extraknowledge (@Extraknowledged) May 23, 2023