ఐపీఎల్ ఫైనల్ కి వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో రిజర్వ్ డేకి షెడ్యూల్ చేశారు. మరి ఈరోజు అహ్మదాబాద్ లో వాతావరణం ఎలా ఉంది? ఈరోజైనా మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ ఫైనల్ అసలు జరిగే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ మధ్య ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే ఆదివారం మ్యాచ్ జరిగి ఉంటే ఈపాటికే విన్నర్ ఎవరనేది తెలిసిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. వర్షం అనుకోని అతిథిలా ఎంట్రీ ఇచ్చి, మొత్తం సీన్ మార్చేసింది. కనీసం టాస్ కూడా పడలేదు. దీంత మ్యాచ్ ని రిజర్వ్ డేకి మార్చారు. మరి ఈరోజైనా (సోమవారం) ఫైనల్ జరుగుతుందా అనే అనుమానాలు ఫ్యాన్స్ కి వస్తున్నాయి. మరి అహ్మదాబాద్ లో వాతావరణం ఎలా ఉంది? మ్యాచ్ జరిగే అవకాశముందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి అంతా రెడీ. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 10వ సారి ఫైనల్ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బరిలో ఉన్నాయి. దీంతో మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు వేలాదిమంది అభిమానులు దేశం నలుమూలల నుంచి మోదీ స్టేడియానికి వచ్చారు. కానీ వర్షం సడన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కుండపోతలా కురిసింది. మధ్యలో ఆగితే తక్కువ ఓవర్లతోనైనా నిర్వహించాలని అనుకున్నారు. కానీ కనీసం టాస్ వేసే ఛాన్స్ కూడా వర్షం ఇవ్వలేదు. దీంతో సోమవారం రిజర్వ్ డేకి మ్యాచ్ ని షెడ్యూల్ చేశారు.
అహ్మదాబాద్ లో సోమవారం మధ్యాహ్నం కూడా వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ సాయంత్రానికి అంటే రాత్రి 7 గంటలకు, మ్యాచ్ ప్రారంభమయ్యే సరికి మబ్బులు తప్పితే వర్షం పడదని వాతావరణ రిపోర్ట్ సూచిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పూర్తి ఓవర్ల కోటా అంటే 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుంది. ఒకవేళ వాతావరణ రిపోర్ట్ అంచనాలు తలకిందులై.. ఈ రోజు కూడా వర్షం పడి, కనీసం సూపర్ ఓవర్ కూడా వేయలేని పరిస్థితి వస్తే మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ జట్టుకే కప్ ఇచేస్తారు. సో అదనమాట విషయం. మరి ఐపీఎల్ ఫైనల్ జరుగుతుందా? లేదా? మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
Narendra Modi stadium is all set to host IPL 2023 Finals💛
Unreal craze of MS Dhoni in the stadium today before the match. #IPL2023Final #CSKvGT #IPLFinal #NarendraModiStadium #IPL2023Final #MSDhoni #HardikPandya #rain pic.twitter.com/sdqqP2DyOv
— Anand Kumar (@Anand_Mzf) May 28, 2023