పీఎల్ మినీ వేలం గ్రాండ్ గా స్టార్టయింది. కొచ్చిలో జరుగుతున్న ఈ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 405 మంది ప్లేయర్స్ లో 273 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. 132 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో నిలిచింది. మొత్తంగా 87 మంది ఆటగాళ్లకు ఛాన్స్ దక్కింది. అందులో 30 విదేశీ క్రికెటర్లకు స్లాట్స్ ఉండగా.. మరో 57 ప్లేసుల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. వేలం హోరాహోరీగా సాగింది. అందులో పలువురు విదేశీ క్రికెటర్లు కళ్లు చెదిరే మొత్తాన్ని దక్కించుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ జాక్ పాట్ దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన వేలంలో ఇతడిని ముంబయి ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. ఏకంగా రూ.17.5 కోట్లు మరీ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇతడి కంటే ఈ లిస్టులో సామ్ కరన్ ఉన్నాడు. కరన్ ని పంజాబ్ జట్టు.. ఏకంగా రూ.18.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గ్రీన్, అత్యధిక ధరకు అమ్ముడుపోతాడని అనుకున్నారు. కానీ ఇంత కోట్లు పెట్టి కొంటారని ఊహించలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
🚨 Cameron Green becomes the 2nd most expensive player in the #IPLAuction.
He will play for Mumbai!
#IPL2023Auction pic.twitter.com/rMQIQbcp3a— 100MB (@100MasterBlastr) December 23, 2022