MS Dhoni: టెస్టు ప్లేయర్ అనుకున్న రహానే ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నాడు. అంతకు ముందు రంజీల్లో కూడా అదరగొట్టాడు. దీంతో అతనికి మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆ పిలువు వెనుక ధోని ఉన్నాడు.
ఐపీఎల్ 2023లో చాలా సంచలనాలు నమోదు అవుతున్నాయి. అందులో అందర్ని ఆశ్చర్యపరుస్తున్న విషయం రహానే బ్యాటింగ్. టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ముద్ర పడిన అజింక్యా రహానే.. టీ20 క్రికెట్ కోసమే పుట్టిన హిట్టర్‌లా చెలరేగిపోతున్నాడు. టీమిండియా టెస్ట్ టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న రహానే.. ఫేలవ ఫామ్‌తో జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా బీసీసీఐ అన్యూవల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. దీంతో రహానే పని అనిపోయిందని, అతని కెరీర్ ముగిసినట్లే అని అంతా భావించారు. కానీ, గోడకి కొట్టిన బంతిలా రంజీ సీజన్‌లో రాణించిన రహానే.. తాజాగా ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నాడు. సంచలన బ్యాటింగ్‌తో అందరి మతిపొగొడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇటివల బీసీసీఐ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఆ జట్టులో అనూహ్యాంగా రహానేకు స్థానం దక్కింది. జూన్ 7 నుంచి 11 మధ్య ఇంగ్లండ్‌లోని ఓవెల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ సారథ్యంలో జట్టును ప్రకటించారు. ఈ టీమ్‌లో రహానేకు చోటు దక్కడం విశేషం. అయితే.. కొంతకాలం క్రితం పూర్ ఫామ్‌తో జట్టు నుంచి ఉద్వాసనకు గురైన రహానే.. మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దేశవాళీ క్రికెట్‌లో శ్రమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే రహానేకు చోటు దక్కుతుందని భావించానా.. అలా జరగలేదు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రహానేకు టీమ్‌లో చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
అయితే రహానేను ఎంపిక చేయడానికి టీమిండియా మేనేజ్‌మెంట్, భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో చెన్నై సారథి ధోనీని సంప్రదించినట్లు సమాచారం.టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధోనీకి ఫోన్ చేసి రహానే ఫిట్‌నెస్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రహానే టీమిండియాలో ఉండాల్సిన అవసరాన్ని ధోని కూడా సెలెక్టర్లకు, ద్రవిడ్‌కు వివరించినట్లు సమాచారం. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయంతో టీమిండియాకు దూరం అయినప్పటి నుంచి రహానే బీసీసీఐ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా రహానేకు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉండటం ప్లస్ పాయింట్. కాగా రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్‌గా రహానే.. 11 ఇన్నింగ్స్‌ల్లో 57.63 యావరేజ్‌తో 634 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో 209 పరుగులు చేసి అదరగొట్టాడు. మరి రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేయడం వెనుక ధోని ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni’s inputs were taken by the Indian team management and selection committee before recalling Ajinkya Rahane for the WTC Final. (Reported by TOI).
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2023