సాఫీగా సాగుతున్న ఐపీఎల్ పదహారో సీజన్లో వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా కొత్త వివాదానికి తెరదీశాడు. తాను వేసిన తొలి బాల్కే రూల్స్ బ్రేక్ చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ఇప్పటివరకు సాఫీగా, ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ టోర్నీలో భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొత్త వివాదానికి తెరలేపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచులో మిశ్రాతో కాస్త ఆలస్యంగా బౌలింగ్ చేయించాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతుండటంతో లెగ్ స్పిన్నర్ అయిన మిశ్రాను ప్రయోగించే సాహసం చేయలేదు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో బౌలింగ్‌కు దిగాడు అమిత్ మిశ్రా. అయితే తొలి బంతి విసరక ముందే రూల్స్ బ్రేక్ చేశాడు. కరోనా ప్రభావంతో క్రికెట్లో బాల్‌కు ఉమ్మి రాయడాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధించింది.
కానీ మిశ్రా ఆ విషయం మర్చిపోయి అలవాటులో పొరపాటులా బాల్‌కు ఉమ్మి రాసి ఫస్ట్ బాల్ వేశాడు. అయినప్పటికీ అంపైర్లు ఆ విషయాన్ని పసిగట్టలేదు. దీంతో నెటిజన్స్ ఒక రేంజ్లో అమిత్ మిశ్రా, మ్యాచ్ అఫీషియల్స్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ అంపైర్లు ముందే గుర్తించి ఉంటే.. ఆ బాల్‌ను వెంటనే తమ చేతుల్లోకి తీసుకుని శానిటైజ్ చేసి తిరిగి ఇవ్వాలనేది రూల్. ఇకపోతే, ఆ మ్యాచ్‌లో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మిశ్రా.. 18 రన్స్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీని తాను వేసిన మూడో బాల్కే ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ బాదుడుకు బలయ్యాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో నెగ్గిన విషయం విదితమే. కోహ్లీని ఔట్ చేసేందుకే మిశ్రా రూల్స్ బ్రేక్ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. మిశ్రా సలైవా ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Is saliva allowed in ipl?? #iplinhindi #IPL2023 #ipl #rcb #JioCinema pic.twitter.com/Uh7hiR7D2G
— ROHIT RAJ (@RohitRajSinhaa) April 10, 2023