ఆకాష్ మద్వాల్.. ముంబయికి దొరికిన మరో స్టార్ బౌలర్. దీంతో అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీతో ఇతడికి ఉన్న రిలేషన్ గురించి మీలో ఎవరికైనా తెలుసా?
ఐపీఎల్ లో ఏం జరిగినా సరే అటు తిరిగి ఇటు తిరిగి ఆర్సీబీ దగ్గరే వచ్చి ఆగుతోంది. ఈ టీమ్ అలాంటిది మరి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ప్లే ఆఫ్స్ లోని తాజాగా ముంబయి-లక్నో జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. బౌలర్ ఆకాష్ మద్వాల్ సూపర్ బౌలింగ్ చేసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. ఇతడి విషయంలో అందరూ ముంబయిని మెచ్చుకుంటున్నారు. కొందరు మాత్రం ఆర్సీబీని తిడుతున్నారు. అదే టైంలో కోహ్లీతో ఇతడికి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొచ్చేస్తే.. చెపాక్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 182/8 స్కోరు చేసింది. గ్రీన్ 44, సూర్యకుమార్ 33, తిలక్ వర్మ 26 బ్యాటింగ్ లో ఆకట్టుకున్నారు. ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. 101 పరుగులకే ఆలౌటైంది. ముంబయి బౌలర్ ఆకాష్ మద్వాల్.. ఏకంగా 5 వికెట్లు తీసి ఈ ఓటమికి కారణమయ్యాడు. ఈ సీజన్ లో పంజాబ్, ఆర్సీబీ మ్యాచ్ ల్లోనూ ఆకాష్ బాగా బౌలింగ్ చేసినప్పటికీ.. లక్నోతో ప్లే ఆఫ్స్ మ్యాచ్ తోనే గుర్తింపు లభించింది. ఇదే టైంలో అతడి పాత వీడియోలు బయటకొచ్చాయి.
ఉత్తరాఖండ్ కి చెందిన ఆకాష్ మద్వాల్ ని తొలుత భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ గుర్తించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆర్సీబీలో నెట్ బౌలర్ గా ఛాన్స్ దక్కించుకున్నాడు. 2019-20 ఇలా రెండేళ్లపాటు అతడిని నెట్ బౌలర్ గానే చూసింది తప్ప ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోహ్లీతో మాత్రం మంచి బాండింగ్ మెంటైన్ చేశాడు. కానీ పరిస్థితులు కలిసి రాలేదు. మరోవైపు ముంబయి జట్టు ఆకాష్ లో టాలెంట్ ని గుర్తించింది. సూర్యకుమార్ గాయపడటంతో రీప్లేస్ మెంట్ గా గతేడాది ఇతడిని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ లో ఏకంగా ఛాన్సులిచ్చి స్టార్ బౌలర్ గా మార్చేసింది. అలా ఆర్సీబీ ఉపయోగించుకోలేకపోయిన టాలెంట్.. ముంబయి టీమ్ వల్ల బయటకొచ్చింది. అదనమాట విషయం. మరి ఆకాష్ బౌలింగ్ పై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.