ఐపీఎల్ 2022లో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచలో ఆర్సీబీ యువ ప్లేయర్ రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్సీబీ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ శతకంతో పటీదార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా పటీదార్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో వృద్దిమాన్ సాహా రికార్డును సమం చేశాడు. సాహా 49 బంతుల్లో సెంచరీ సాధించగా.. పటీదార్ కూడా 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ సాధించిన నాలుగో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.
కీలక మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ కేజీఎఫ్ విరాట్ కోహ్లీ(25), గ్లేన్ మ్యాక్స్‌వెల్(9), ఫాఫ్ డుప్లెసిస్(0)) విఫలమైన వేళ.. పటీదార్ జట్టుకు గెలిపించాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సెంచరీ హీరోను మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రూ.20 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్న అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజ్‌లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గత సీజన్లో ఆర్సీబీకే ఆడిన పటీదార్.. పెద్దగా రాణించలేదు. దాంతో అతన్ని వదిలేసిన ఆర్సీబీ.. మళ్లీ కొనుగోలు చేయలేదు. కనీసం ఎక్స్ట్రా ప్లేయర్‌గా జట్టులో ఉంచుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. అయితే జట్టులోని యువ ప్లేయర్ లువ్నీత్ సిసోడియా గాయపడటంతో అతని ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది.
అయితే ఆరంభ మ్యాచ్‌ల్లో అనూజ్ రావత్‌కు అవకాశం ఇచ్చిన ఆర్సీబీ.. అతను విఫలమవడంతో కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. పటీదార్‌ను ఫస్ట్ డౌన్లో ఆడించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పటీదార్ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న పటీదార్.. సన్‌రైజర్స్‌పై 48 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పటీదార్.. 275 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పటీదార్.. ఆర్బీసీకి కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం పటీదార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో పాటు.. అసలు పటీదార్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే విషయంపై కూడా క్రికెట్ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పూర్తి పేరు రజత్ మనోహర్ పటీదార్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. 29 ఏళ్ల పటీదార్ 2015లో మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పటీదార్ 40.43 సగటుతో 2588 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 43 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 34.07 సగటుతో 1397 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్లో 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుఫున అరంగేట్రం చేసిన పటీదార్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 38.44 సగటుతో 346 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఒక బుధవారం లక్నో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు పటీదార్. మరి అతను ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: లక్నోతో మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లోనే ప్రార్థన చేసి.. దేవుడికి థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ
One man show in the eliminator 🔥
Rajat Patidar 😍
📸: IPL/BCCI pic.twitter.com/JMbj22T1EG
— CricTracker (@Cricketracker) May 25, 2022