కోహ్లీతో గొడవపెట్టుకోవడం కాదు. దాంతోపాటు వచ్చే పరిణామాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందు గొడవపడినప్పటికీ.. ఆ తర్వాత లక్నో ప్లేయర్ నవీన్ భయపడిపోయాడు.
కోహ్లీతో గొడవపడాలంటే అవతలవైపు కూడా కోహ్లీనే అయ్యుండాలి. ఎందుకంటే ఒకసారి బరిలో దిగితే రచ్చ ఆ రేంజులో ఉంటుంది మరి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా లక్నో-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా అనుకోని సంఘటన జరిగింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు చిన్నగా ఉన్న వివాదం కాస్త పూర్తయిన తర్వాత పెద్దదైపోయింది. కోహ్లీ-గంభీర్ మాటామాట అనుకునేంతవరకు వెళ్లిపోయింది. ఈ మొత్తం ఇష్యూలో నవీన్ హుల్ హక్ అనే ఓ యంగ్ ప్లేయర్ ఉన్నాడు. ముందు కోహ్లీతో గొడవపడ్డాడు కానీ ఇప్పుడు భయపడిపోయి ఆ పనిచేశాడు.
అసలు విషయానికొస్తే.. సాధారణంగా క్రికెట్ మ్యాచులంటే స్లెడ్జింగ్ చేసుకోవడం సర్వసాధారణం. ఐపీఎల్ వల్ల అన్నిజట్లు ప్లేయర్స్ కలిసిమెలిసి ఆడుతున్నారు. దీంతో మైదానంలో గొడవలు చాలావరకు తగ్గిపోయాయి. కానీ తాజా మ్యాచ్ లో అలా కాకుండా పెద్ద గొడవే జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా.. లక్నో ప్లేయర్ నవీన్ హుల్ హక్, కోహ్లీవైపు సీరియస్ గా చూస్తూ లుక్ ఇచ్చాడు. అప్పుడు మరో ఎండ్ లో ఉన్న అమిత్ మిశ్రా కల్పించుకుని ఆపే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకునే టైమ్ లో నవీన్.. కోహ్లీతో కాస్త శ్రుతిమించి ప్రవర్తించాడు. దీంతో అసలు కథ షూరు అయింది.
తొలుత షేక్ హ్యాండ్ ఇచ్చుకునే టైంలో నవీన్-కోహ్లీ మధ్య చిన్నసైజ్ వివాదం జరిగింది. ఆ తర్వాత గొడవలోకి గంభీర్ ఎంటర్ కావడంతో నవీన్ గురించి చాలామంది పట్టించుకోలేదు. కానీ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం నవీన్ ని గుర్తుపెట్టుకున్నారు. ఆర్సీబీపై 3 వికెట్లు తీశానని ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై కేవలం అరగంటలోనే 50 వేల కామెంట్స్ పెట్టారు. దెబ్బకు భయపడిపోయిన నవీన్.. మరెవరు ఏం అనుకుండా కామెంట్స్ ని ఆఫ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముందు గొడవపడ్డాడు కానీ ఇప్పుడు భయపడిపోయాడని మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్ మిగతా మ్యాచుల్లోనూ నవీన్ కి కోహ్లీ ఫ్యాన్స్ సెగ తప్పదని అనిపిస్తోంది. మరి నవీన్ దుందుడుకు స్వభావంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Power of #ViratKohli fanbase
In last 30 minutes 50000 abuses were being given to naveen ul haq
Now Comments off 😂 pic.twitter.com/8a2050BZ9Q— The Random Indian (@randomsena) May 1, 2023
Naveen ul haq show this attitude to King kohli ? Why?
.#ViratKohli #RCBVSLSG #ViratKohli gambhir Amit Mishra Naveen pic.twitter.com/sXJee63KZh— MSDIAN❤️🇮🇳(07) (@Msdian_070) May 1, 2023