ఐపీఎల్ 2022లో అద్భుతం జరుగుతుందని అంతా ఎదురుచూశారు. కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో అదే ఫలితం రిపీట్ అయ్యింది. ఈసారన్నా కప్పు కొట్టి.. ‘ఈ సాలా కప్ నమ్దే’ అనే నినాదానికి న్యాయం చేస్తారని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో 207 పరుగులు చేసి క్వాలిఫయర్ 2లో అడుగుపెట్టిన ఆర్సీబీని చూసి ఈసారి ఫైనల్ కెళ్లడం, కప్పుకొట్టడం ఖాయమని అంతా భావించారు. టాస్ గెలిసి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు బెంగళూరును కట్టడి చేయడంలో సఫలీకృతమైంది. కీలక మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్ మన్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగారు.
రజత్ పాటిదార్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 25 పరుగులు చేశారు. కోహ్లీ మరోసారి కీలక మ్యాచ్ లో అత్యంత తక్కువ స్కోరుతో పెవిలియన్ చేరాడు. బౌలర్ల విషయానికి వస్తే… షబాజ్ వేసిన 2 ఓవర్లలో 35 పరుగులు ఇవ్వగా.. మహ్మద్ సిరాజ్ 2 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు.
#RCB‘s golden boy #Siraj this season
– Crossed 500+ runs with the ball (2 more overs to go)
– 514 runs in 51 overs with 10+ ecoIf Mohammad Siraj was a batsman, he’d be the third highest run scorer this season.#RCBvsRR #RRvsRCB #IPL2022
Well played, @mdsirajofficial miyan! pic.twitter.com/mLqRFZSoT7
— Ashish Pareek (@pareektweets) May 27, 2022
మహ్మద్ సిరాజ్ కు ఈ ఐపీఎల్ సీజన్ ఓ పీడకల అనే చెప్పాలి. బౌలింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్ మొత్తం 15 మ్యాచుల్లో 514 పరుగులు ఇచ్చి కేవలం 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అంతేకాకుండా మరో చెత్త రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఏ బౌలర్ కూడా కోరుకోని రికార్డును తన పేరిట నమోదు చేశాడు. ఆ రికార్డు ఏంటంటే.. ఐపీఎల్ లో ఒక సీజన్ లో ఎక్కువ సిక్సులు కొట్టించిన బౌలర్ గా సిరాజ్ రికార్డు కెక్కాడు. ఈ సీజన్లో సిరాజ్ 31 సిక్సులు కొట్టించాడు.
Mohammad Siraj in IPL 2022 :
Innings – 15
Overs – 51.0
Runs – 514
Mdns – 0
Wickets – 9
BBI – 2/30
Avg – 57.11
Eco – 10.07
Sr – 34.0#IPL #RCBvsRR #siraj Virat Kohli Jadeja— Mark Lakdi (@Mark_lakdi_) May 27, 2022
రాజస్థాన్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. మరోసారి జోస్ బట్లర్ చెలరేగి ఆడాడు. కేవలం 60 బంతుల్లోనే 6 సిక్సులు, 10 ఫోర్లతో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కీలక మ్యాచ్ లో శతకంతో చెలరేగాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 151 స్ట్రైక్ రేట్ తో 824 పరుగులు చేశాడు. వాటిలో 4 శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంక ఫైనల్ లోనూ ఇదే జోరు కొనసాగిస్తే.. రాజస్థాన్ రాయల్స్ కప్పు కొట్టడం ఖాయమే. ఆర్సీబీ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
RCB is out because of these 3
– Mike Hesson
– Virat Kohli
– Mohammad Siraj— JSK (@imjsk27) May 13, 2022
ఇదీ చదవండి: సూర్యకుమార్ యాదవ్ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్! వివరణ ఇచ్చుకున్న మిస్టర్ 360