ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలం అయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న తొలి టీమ్‌గా నిలిచింది. జట్టు రిటేన్ చేసుకున్న ఆటగాళ్లు రోహిత్ శర్మ, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాల్లో బుమ్రా , సూర్య పర్వాలేదనిపించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్ దారుణంగా విఫలం అయ్యారు. కోట్లు పోసి కొన్న ఇషాక్ కిషన్ నిరాశ పరిచాడు. దీంతో ముంబైకి ఈ సీజన్ ఒక పీడకలలా మారింది. రోహిత్ బ్యాడ్ ఫామ్‌తో టాప్‌ఆర్డర్, పొలార్డ్ వైఫల్యంతో లోయర్ ఆర్డర్ దారుణంగా దెబ్బతిన్నాయి.
దీంతో ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ను గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కన పెట్టింది. ఎలాగో ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నా.. పరువు కోసం ఆడే మ్యాచ్‌లో పొలార్డ్ పక్కన పెట్టడం ముంబై ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. పైగా గురువారం పొలార్డ్ పుట్టిన రోజు కూడా.. బర్త్‌డే రోజన్నా బాగా ఆడి ఫామ్‌లోకి వస్తాడనుకుంటే.. అసలు జట్టులో చోటే ఇవ్వలేదు ముంబై మేనేజ్‌మెంట్. ఈ విషయంలో పొలార్డ్ తీవ్రంగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. బర్త్‌డే రోజు జరిగే మ్యాచ్‌లో ఆడించకుంటా.. తనను అవమానించారని పొలార్డ్ బాధపడినట్లు సమాచారం. వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను వీడి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజ్‌కు మారే ఆలోచనలో పొలార్డ్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.ఐపీఎల్ 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ అదరగొడుతుంది. పైగా ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యాతో పొలార్డ్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. హార్థిక్ పాండ్యా కూడా ఈ మధ్య వచ్చే సీజన్‌లో పొలార్డ్ గుజరాత్ టీమ్‌లో ఆడే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు. పొలార్డ్ కూడా వెస్టిండీస్ టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను కూడా మార్పు కోరుకుంటున్న సమయంలో.. ముంబై జట్టులో గురువారం జరిగిన అవమానంతో మరింత కోపంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లో కూడా పొలార్డ్ బరిలోకి దిగడని సమాచారం. కాగా.. ఇంటర్నల్ ఎక్స్‌చేంజ్‌తో పొలార్డ్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ కూడా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: 40 ఏళ్ల ధోని సక్సెస్.. మిగతా CSK టీమ్ అంతా అట్టర్ ప్లాప్!
With MI out of playoff contention, Kieron Pollard made the call to step out of the XI #CSKvMI | #IPL2022
👉 https://t.co/XO4JoWlv2N pic.twitter.com/UKwPAehsZs
— ESPNcricinfo (@ESPNcricinfo) May 12, 2022
Happiest birthday to you @KieronPollard55.
Have a jolly one Polly! pic.twitter.com/Qzl2gxTayC— Sachin Tendulkar (@sachin_rt) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.