వెస్టిండీస్ కి చెందిన బ్రావో, పోలార్డ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్లు అభిమానులకి వినోదాన్ని పంచడంలో ముందుంటారు. తాజాగా అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
క్రికెట్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లో బ్రావో, పోలార్డ్ ప్రధమ వరుసలో నిలుస్తారు. వీరు తమ జట్లకు మంచి ప్రదర్శన చేస్తూ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. పోలార్డ్ బ్యాటింగ్ తో అడగొడితే అప్పుడప్పుడూ బౌలింగ్ కూడా మెరిసేవాడు. ఇక బ్రావో బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తూ.. కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ లో కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడేవాడు. వెస్టిండీస్ కి చెందిన ఈ ఇద్దరు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్ద కాలంగా ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఒకే జట్టు తరఫున ఆడినా.. ప్రత్యర్థులుగా తలపడినా ఈ వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్లు అభిమానులకి వినోదాన్ని పంచడంలో ముందుంటారు. తాజాగా అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
ప్రస్తుతం అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ టోర్నీ చివరిదశకు చేరుకోగా ఫైనల్ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో భాగంగా నేడు జరిగిన క్వాలిఫయర్ 2 లో మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ టీంపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఎంఐ న్యూయార్క్ టీం ఎంఎల్‌సీ ఫైనల్‌లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఎంఐ ప్లేయర్ పొలార్డ్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ప్లేయర్ బ్రేవోని సరాదాగా ఆటపట్టించడం హైలెట్ గా మారింది. పొలార్డ్ ఇక నువ్వు ఫ్లయిట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది అని సైగ చేసాడు. దీనికి బ్రావో చాలా వినమ్రంగా అలాగే అంటూ నమస్కారం పెడుతూ కనిపించాడు. చాలా ఫన్నీగా సాగిన ఈ సంభాషణ ముచ్చట గొలిపేలా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇద్దరూ కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి వారి జట్లకు కోచ్ గా మారారు. అయితే మేజర్ లీగ్ క్రికెట్ లో మాత్రం ఆడుతూ తమలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని నిరూపించారు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ జట్టును ఎంఐ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 158 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే (38), మిలింద్ కుమార్ (34) ఓ మాదిరిగా ఆడి ఫర్వాలేదనిపించారు. ఎంఐ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక ఛేజింగ్ లో ఎంఐ బ్యాటర్లు మొదట్లో ఆచితూచి బ్యాటింగ్ చేసినా చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (33) డేవిడ్ వీస్ (19 నాటౌట్) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని ఖాయం చేశారు. మొత్తానికి మ్యాచ్ విషయం పక్కన పెడితే పొలార్డ్, బ్రావో సంభాషణ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
These two & their banter 😂💙
Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg
— MI New York (@MINYCricket) July 29, 2023