గ్రౌండ్ లో ఇద్దరు ఆటగాళ్లు గొడవ పడడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లో జరిగిన విషయాలను మాట్లాడుకొని గొడవపడడడం కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బ్రావో, పోలార్డ్ కూడా నా టీం గొప్పదంటే నా టీం తోపు అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కనిపించారు.
క్రికెట్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లో బ్రావో, పోలార్డ్ ప్రధమ వరుసలో నిలుస్తారు. వీరు తమ జట్లకు మంచి ప్రదర్శన చేస్తూ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. పోలార్డ్ బ్యాటింగ్ తో అడగొడితే అప్పుడప్పుడూ బౌలింగ్ కూడా మెరిసేవాడు. ఇక బ్రావో బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తూ.. కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ లో కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడేవాడు. అయితే వీరిద్దరూ ప్లేయర్లుగా ఉన్నప్పుడూ.. ఒకరినొకరు గ్రౌండ్ లోనే సీరియస్ గా గొడవ పొడపడతూ కనిపిస్తారు. అయితే ఒకప్పుడు గ్రౌండ్ లో గొడవపడుతూ కనిపించిన వీరిద్దరికీ ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి వారి జట్లకు కోచ్ గా మారారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ బయట గొడవపడుతూ కనిపించారు.
గ్రౌండ్ లో ఇద్దరు ఆటగాళ్లు గొడవ పడడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లో జరిగిన విషయాలను మాట్లాడుకొని గొడవపడడడం కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బ్రావో, పోలార్డ్ కూడా నా టీం గొప్పదంటే నా టీం తోపు అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కనిపించారు. వెస్టిండీస్ కి చెందిన ఈ ఇద్దరు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్ద కాలంగా ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఒకే జట్టు తరఫున ఆడినా.. ప్రత్యర్థులుగా తలపడినా ఈ వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్లు అభిమానులకి వినోదాన్ని పంచడంలో ముందుంటారు. ప్రస్తుతం బ్రావో చెన్నై టీంకి, పోలార్డ్ ముంబై టీంకి కోచ్ గా సేవలను అందిస్తున్నారు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో చేనై జట్టు విజేతగా నిలిస్తే.. ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2 లో గుజరాత్ చేతిలో ఓడిపోయింది.
ఈ విజయాన్ని గురించి బ్రావో మాట్లాడుతూ ..”ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్ మాదే. మేము ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచాం. అంతేగాకుండా కోచ్‌గా తొలి టైటిల్ అందుకున్నాను” అని బ్రావో పోలార్డ్‌ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియోను బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి పోల్లర్డ్ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు ఫ్రాంచైజీ క్రికెట్ లో నేనే ఎక్కువ టైటిల్స్ గెలిచాను అని అడగ్గా.. వెంటనే బ్రావో.. నీకంటే నేనే ఎక్కువగా టైటిళ్లు గెలిచానని చెప్పాడు. అంతేకాదు ఐపీఎల్ లో కూడా తమదే సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్సేనని, తమ జట్టు రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిస్తే.. ముంబై ఒక్కటే గెలిచిందని గుర్తు చేశాడు. దీంతో బ్రావోతో పోలార్డ్ వాదించలేకపోయాడు. ఈ వీడియోకు బ్రావో తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. ‘ఎవరైనా ఈ డిబెట్ ముగిసేలా సహాయం చేయండి. అంటూ పొలార్డ్ మీద సానుభూతి చూపించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన చిన్న పిల్లల మాదిరి ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.